AP Liquor Scam Case: ఏపీ మద్యం కేసులో కీలక నిందితులు, మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన నలుగురిని సిట్ రెండో రోజు కస్టడీకి తీసుకుంది. ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, సీఎంతో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, జగన ఎఎస్టీ పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందరప్ప బాలాజీలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణకు ముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు నిందితులను విచారించున్నారు.