Gautam Gambhir Viral Video: టీమిండియా ప్రధాన శిక్షకుడు గౌతమ్ గంభీర్ కు ముక్కు మీద కోపం ఉంటుందని అందరికీ తెలుసు. అంతర్ముఖుడిగా ఉండే అతడు.. తనకు నచ్చని ఏ విషయంపైనైనా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఏ మాత్రం భయపడకుండా తన అభిప్రాయాన్ని బయటపెడతాడు. అందువల్లే అతడు అంటే చాలామంది భయపడతారు. అక్కడిదాకా ఎందుకు అంతటి రోహిత్, విరాట్ టెస్ట్ ఫార్మాట్ నుంచి బయటికి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం కూడా గంభీర్ అని అంటారు.. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని రకాలుగా మాటలు వినిపించినా గౌతమ్ గంభీర్ పట్టించుకోడు.
Also Read: చివరి టెస్టులో మేనేజ్మెంట్ ప్రయోగాలు.. వారిద్దరికీ చోటు..
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లీష్ గడ్డమీద పర్యటిస్తోంది. ఇంగ్లీష్ జట్టుతో ఇప్పటికే నాలుగు టెస్టులు ఆడింది. 1-2 తేడాతో వెనుకబడిపోయింది. నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని దూరం చేసి.. సిరీస్ మీద ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఐదో టెస్టు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఒక వీడియో ఆసక్తికరంగా దర్శనమిస్తోంది. అందులో గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ పిచ్ క్యూరేటర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది.. ” మా పని మేం చేసుకుంటాం. మధ్యలో నువ్వు వేలు పెట్టకు. మేము ఏం చేయాలో మాకు తెలుసు. కొత్తగా నువ్వు మాకు నేర్పించకు” అని పిచ్ క్యూరేటర్ ను ఉద్దేశించి గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తున్నాయి.
Also Read: కోనేరు హంపి ఎత్తులకు.. పై ఎత్తు.. అక్కడే దివ్య మాస్టర్ బ్రెయిన్.. సీన్ కట్ చేస్తే ప్రపంచ ఛాంపియన్!
ఇప్పుడు మాత్రమే కాదు అనేక సందర్భాలలో గౌతమ్ గంభీర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఇంగ్లీష్ గడ్డ మీద ఉన్న పిచ్ లను ఉద్దేశించి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. జట్టు అంతర్గత సమావేశాలలో ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ బయటకు వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలతో జట్టు సభ్యులు కూడా ఏకీభవించినట్టు సమాచారం. ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో కూడా పిచ్ విభిన్నమైన ప్రభావాన్ని చూపించింది. కొన్ని సందర్భాలలో భారత బ్యాటర్లకు చుక్కలు చూపించింది. అందువల్లే గౌతమ్ గంభీర్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గౌతమ్ గంభీర్ ఆగ్రహంతోనైనా ఐదో టెస్ట్ జరిగే వేదికలో పిచ్ ను మార్చుతారా? లేకుంటే అలానే ఉంచుతారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
Gautam Gambhir SHUTS UP the entitled pr!ck Oval curator –
“DO NOT TELL US WHAT TO DO.”
There will still be Indians here loading the curator up deep into their throats just because it was Gambhir who had a fued. pic.twitter.com/mjgDTuGYUn
— KKR Vibe (@KnightsVibe) July 29, 2025