FIDE Women’s World Cup winner: మనదేశంలో చదరంగ క్రీడలో పేరొందిన క్రీడాకారిణిగా కోనేరు హంపి సుపరిచితురాలు. ప్రపంచ స్థాయిలో కూడా ఆమె అద్భుతమైన విజయాలు సాధించింది. అటువంటి క్రీడాకారిణిని మన దేశానికి చెందిన 19 సంవత్సరాల దివ్య ఓడించింది. అంతేకాదు ఫిడే మహిళల ప్రపంచ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. దివ్య స్వస్థలం మహారాష్ట్ర. ఈయన వయసు 19 సంవత్సరాలు. ఈ విజయం ద్వారా దివ్య భారత దేశపు నాలుగవ గ్రాండ్ మాస్టర్ గా అవతరించింది.
జార్జియాలోని బుటుమి ప్రాంతంలో ఫిడే మహిళల ప్రపంచ కప్ జరుగుతోంది. ఇప్పటికే దివ్య ఫైనల్ వెళ్ళిపోయింది. కోనేరు హంపి కూడా ఫైనల్ వెళ్లిపోయి చరిత్ర సృష్టించింది.. వీరిద్దరి మధ్య జరిగిన ఫైనల్ టై బ్రేక్ కు దారి తీసింది. ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేయడంతో పోటీ అత్యంత రసవత్తరంగా సాగింది. రెండవ ర్యాపిడ్ గేమ్ లో హంపి తప్పులు చేయగా.. దివ్య వాటిని తనకు అనుకూలంగా మలుచుకుంది.. వీరిద్దరి మధ్య మొదటి గేమ్ డ్రా అయింది. అయితే రెండవ గేమ్ లో దివ్య నల్లటి పావులతో రంగంలోకి దిగింది. తద్వారా టై బ్రేకర్ కు మ్యాచ్ దారి తీయడం.. ఇందులో దివ్య అద్భుతమైన ఎత్తులు వేయడంతో విజయం సాధ్యమైంది.. వాస్తవానికి 53 ఎత్తుల వరకు ఇద్దరి మధ్య పోటీ హోరా హోరిగా సాగింది. 38 సంవత్సరాల హంపి అద్భుతమైన ఎత్తులు వేసింది. అయితే 54 ఎత్తులో మాత్రం లేట్ ఎర్రర్ వేసిన హంపి.. ప్రత్యర్ధికి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని దివ్య తనకు అనుకూలంగా మలుచుకుంది. అంతే ఒక్కసారిగా మ్యాచ్ దివ్య వైపు వెళ్ళిపోయింది. తద్వారా దివ్య ప్రపంచ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా దివ్య గ్రాండ్ మాస్టర్ టైటిల్ అందుకుంది. ఈ ఘనత సాధించిన నాలుగవ భారతీయ క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. అంతకంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి గ్రాండ్ మాస్టర్లుగా అవతరించారు..
ఈ టోర్నీలో ఫైనల్ చేరడం ద్వారా దివ్య, హంపి క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత సాధించారు. టోర్నీలో విజయం సాధించిన దివ్య ప్రస్తుత మహిళా ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన జూ వెంజున్ తో పోటీ పడుతుంది. విజయం సాధించిన అనంతరం దివ్య భావద్వగానికి గురైంది. తన వయసు కు మించిన అనుభవం ఉన్న కోనేరు హంపి తో కరచాలనం చేసింది. ” ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. దీనికి చాలా సమయం కావాలి.. గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందడం మామూలు విషయం కాదు. ఇది నాకు సొంతమైనందుకు గర్వంగా ఉందని” దివ్య వ్యాఖ్యానించింది. 2023లో దివ్య ఆసియా ఖండాంతర మహిళ టైటిల్ సొంతం చేసుకుంది. అంతేకాదు మహిళల ర్యాపిడ్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జు వెంజున్ ను అధిగమించి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.. 2024లో అండర్-20 బాలికల ఎస్ ఛాంపియన్ షిప్ సాధించింది..10/11 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకుంది.