War2 Movie Result Hit or Flop: డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తో ఒక సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటూ దూసుకెళ్లిన ఈ చిత్రానికి ప్రస్తుతానికి బ్రేకులు పడింది. అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ తన ‘వార్ 2′(War 2 Movie) మూవీ ప్రొమోషన్స్ కోసం సుదీర్ఘమైన సమయాన్ని కేటాయించడం వల్లే. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ‘వార్ 2’ హిందీ లో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుంది అనే దానిపై ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఇదే ఎన్టీఆర్ కి మొట్టమొదటి డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయితే, ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో బలమైన బేస్మెంట్ పడుతుంది. ఇందులో ఆయన విలన్ రోల్ చేస్తున్నాడు, అయినప్పటికీ కూడా తన కెరీర్ కి బాగా ఉపయోగపడే సినిమానే.
Also Read: ‘హరి హర వీరమల్లు’ హిందీ లో క్లిక్ అవుతుందా..? డిమాండ్ మామూలుగా లేదుగా!
ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఎన్టీఆర్ తో ప్రస్తుతం తానూ చేస్తున్న చిత్రం తో బాలీవుడ్ లో కుంభస్థలం బద్దలు కొట్టే రేంజ్ హిట్ ని అందుకోవచ్చు అనేది ప్రశాంత్ నీల్ ఆలోచన. మరి ఆయన ఆలోచన సక్సెస్ అవుతుందా లేదా అనేది మరో 14 రోజుల్లో తేలనుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోరాట సన్నివేశాలు ఈ చిత్రం లో చాలానే ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. కచ్చితంగా ఈ చిత్రం భారీగానే ఉండేట్టు ఉంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది..సినిమా పరిస్థితి ఏంటంటే?
రేపు ఈ చిత్రం నుండి హృతిక్ రోషన్, కియారా అద్వానీ మధ్య తెరకెక్కించిన ఒక అందమైన మెలోడీ సాంగ్ ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సమందించిన చిన్న ప్రోమో ని మేకర్స్ కాసేపటి క్రితమే విడుదల చేయగా, దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కూడా ఈ ప్రోమో సాంగ్ ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఇకపోతే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య కూడా ఒక అదిరిపోయే రేంజ్ సాంగ్ ని చిత్రీకరించారట, త్వరలోనే ఆ పాటని కూడా విడుదల చేయబోతున్నారట మేకర్స్, నాటు నాటు పాట ఎలా అయితే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిందో, ఈ పాట కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు.