Prithviraj Sukumaran wife: సోషల్ మీడియా లో ఈమధ్య కాలం లో కొంతమంది కొందరు సెలబ్రిటీస్ ని టార్గెట్ గా చేసుకొని అత్యంత నీచమైన కామెంట్స్ చేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఈ కామెంట్స్ ని, వేధింపులను తట్టుకోలేక అనేక మంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ని వదిలి పారిపోయారు. కొంతమంది అయితే ఇలాంటివాళ్లను పట్టించుకోవడం మానేసి తమ పని తాము చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ అందరికీ అలాంటి మనస్తత్వం ఉండదు కదా. సున్నితంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) సతీమణి సుప్రియ మీనన్(Supriya Menon) ఒకరు. రీసెంట్ గా ఆమె తనను ఒక మహిళా ఏడేళ్ల నుండి వేధిస్తున్న విషయాన్ని బహిరంగంగా చెప్పుకొని బాధపడింది. సెలబ్రిటీ స్థాయిలో ఉన్న ఆమెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్యుల సంగతేంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Also Read: కీరవాణి ని ‘విశ్వంభర’ నుండి ఎందుకు తప్పించారు?
సుప్రియ మీనన్ మాట్లాడుతూ ‘2018 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నేను ఒక మహిళ నుండి సోషల్ మీడియా లో తీవ్రమైన వేధింపులను ఎదురుకుంటూ ఉన్నాను. ఆమె పేరు క్రిస్టినాల్డో. గత ఏడేళ్ల నుండి ఆమె నన్ను ట్యాగ్ చేస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ, ఎంతో నీచమైన పోస్టులు వేస్తూ ఉంది. ఆమె ఖాతా ని నేను బ్లాక్ చేశాను. కానీ ఆమె పదే పడే నకిలీ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొచ్చి నన్ను వేధిస్తూనే ఉంది. ఎన్నిసార్లు బ్లాక్ చేసినా ఉపయోగం లేకపోవడం తో ఇక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనుకున్నాను. ఆమె ఎవరో నాకు చాలా ఏళ్ళ క్రితమే తెలిసింది. కానీ ఆమెతో చిన్న బాబు ఉన్నాడని జాలి చూపించి వదిలేసాను. దీనిని ఆమె అలుసుగా తీసుకుంది. ఆమెని నేనేమి చెయ్యలేను అని అనుకుంది’
Also Read: బిగ్ బాస్ 9′ లోకి బోల్డ్ హీరోయిన్..ఇక టీఆర్ఫీ రేటింగ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!
‘చివరికి నా తండ్రి మరణం పై కూడా ఆమె ఎంతో నీచమైన కామెంట్స్ చేసింది. అందుకే ఈరోజు ఆమె గురించి బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె అమెరికా లో ఒక నర్సు గా పని చేస్తుంది. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది సుప్రియ మీనన్. ఈమె ప్రముఖ మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ ని 2011 వ సంవత్సరం లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. పృథ్వీ రాజ్ మలయాళం లో పెద్ద సూపర్ స్టార్. హీరో గా ఎన్నో సంచలనాత్మక విజయాలను అందుకున్న ఆయన, డైరెక్టర్ గా కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ ఏడాది డైరెక్టర్ గా ‘L2 : ఎంపురాన్’ తో భారీ హిట్ ని అందుకున్న పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రస్తుతం మహేష్, రాజమౌళి చిత్రం లో విలన్ గా నటిస్తున్నాడు.