Gautam Gambhir : గత ఏడాది టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సాధించింది. ఆశుభ తరుణంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ ఫార్మాట్ నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు. దానిని మర్చిపోకముందే.. ఏడాది లోపే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మేనేజ్మెంట్ తో నెలకొన్న వివాదాల వల్లే వారిద్దరు టెస్టు ఫార్మాట్ నుంచి శాశ్వతంగా దూరం జరిగారని తెలుస్తోంది. వారిద్దరి రిటైర్మెంట్ పై ఇంతవరకు టీం ఇండియా మేనేజ్మెంట్ స్పందించలేదు. అంటే తొలిసారిగా ఈ వ్యవహారంపై టీమ్ ఇండియా గౌతమ్ గంభీర్ నోరు విప్పాడు.
Also Read : ఎలిమినేట్ అయిన జట్లు విజృంభిస్తే..ఆ టీమ్ లకు చుక్కలే.. టాప్ -2 సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
వారి స్థానం భర్తీ చేయలేం
టెస్టులలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమని సూవిరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.. కొత్త తరం పై తాము ఆశలు పెంచుకున్నామని.. వీరి స్థానాలను కొత్త ఆటగాళ్లు భర్తీ చేయడానికి కాస్తలో కాస్త అవకాశం ఉంటుందని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు..” మా జట్టులో ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వెళ్లిపోయారు. ఇది జట్టుకు చాలా నష్టమైనది. కాకపోతే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఇటీవల బుమ్రా లేకుండానే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది.. కొందరు జట్టులో లేకపోవడం ఇబ్బందికరమే. కాకపోతే వారి స్థానాలను ఇతర ప్లేయర్లు కచ్చితంగా భర్తీ చేస్తారు. ఆ స్థానాల్లో తమను తాము నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ సిద్ధాంతాన్ని నేను నూటికి నూరుపాళ్ళు కచ్చితంగా నమ్ముతానని” గౌతమ్ గంభీర్ వెల్లడించాడు..
అది వారి వ్యక్తిగత నిర్ణయం
” సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలకడం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వ్యక్తిగత నిర్ణయం. ప్లేయర్లపై ఒత్తిడి తీసుకొచ్చే అధికారం మేనేజ్మెంట్ కు ఉండదు. కోచ్ కు అసలు ఉండదు.. సెలక్షన్ కమిటీకి ఏమాత్రం ఆస్కారం ఉండదు. ఇంగ్లీష్ జట్టుతో జరిగే ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడేందుకు ఇండియా సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం సారథి విషయంలో చర్చలు జరుగుతున్నాయి. రోహిత్ తర్వాత ఎవరికి బాధ్యతలు అప్పగిస్తామనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గానే ఉంది. త్వరలోనే టెస్ట్ జట్టుకు సారథి ఎవరు అనే విషయాన్ని నిర్ణయిస్తామని” గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం శనివారం టెస్ట్ జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించే ప్లేయర్ల జాబితాలో చాలామంది ఉన్నారు..గిల్ కు సారధ్య బాధ్యతలు దక్కుతాయని కొంతమంది.. బుమ్రా కే ఆ అవకాశం కల్పిస్తారని కొంతమంది.. రవీంద్ర జడేజా కు నాయకత్వం అప్పగిస్తారని మరి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అంతిమంగా ఎవరికి కెప్టెన్ బాధ్యత దక్కుతుందో చూడాల్సి ఉంది.