Pooja Hegde : హీరోలకు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేదు, ఒక నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అయినా వాళ్ళ సినిమాలను చూస్తారు. ఇక బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉన్న హీరోల సంగతి అసలు చెప్పనవసరం లేదు. వరుసగా పదేళ్లు ఫ్లాప్స్ ఉన్నా వాళ్లకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ హీరోయిన్ కెరీర్ అలా కాదు, రెండు మూడు ఫ్లాప్స్ పడితే కనిపించకుండా పోతారు. కానీ కొంతమంది హీరోయిన్స్ కి మాత్రం ఇది వర్తించదు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రెట్రో’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక హిందీ లో ఈ హాట్ బ్యూటీ ఒక సినిమాని ముట్టుకుంటే మసి అన్నట్టుగా తయారైంది.
ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా కూడా పూజా హెగ్డే క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘జన నాయగన్’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాతో పాటు రీసెంట్ గానే ఆమె ఒక తెలుగు సినిమాలో నటించేందుకు సంతకం చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇది కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా పూజా హెగ్డే ని ఒక హీరోయిన్ గా ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం లో మొత్తం 5 మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో ఇప్పటికే దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇప్పుడు నాల్గవ హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా చిన్న రోల్ కోసం కాదట, కథ ని మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించబోతుందట.
రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్క హిందీ లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. అదే విధంగా తమిళం లో ‘కాంచన 4’ లో కూడా నటించేందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె లిస్ట్ లో చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఈమె వదిలి వెళ్ళినప్పుడు శ్రీలీల ఆ స్థానాన్ని తీసుకుంది. ఇప్పుడు ఆమెకు కూడా వరుస ఫ్లాప్స్ కారణంగా అవకాశాలు రావడం లేదు. అలాంటిది 34 ఏళ్ళ వయస్సు లో కూడా పూజా హెగ్డే ఈ రేంజ్ అవకాశాలను సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. కనీసం రాబోయే సినిమాలతో అయినా ఆమె హిట్ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.