Ravichandran Ashwin : మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు. సొంత మధ్యాహ్నం పై తిరుగులేని రికార్డును సృష్టించుకున్నాడు. ఫలితంగా టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈక్రమంలోనే అశ్విన్ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకొన్నాడు. లెజెండ్ బౌలర్ కోట్ని వాల్ష్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ లయన్ ను అధిగమించాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన ఎనిమిదవ బౌలర్ గా వెస్టిండీస్ దిగ్గజం కొట్ని వాల్ష్ ఉండేవాడు. అతడిని అశ్విన్ అధిగమించాడు. నిన్నటి వరకు 519 వికెట్లతో వాల్ష్ ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉండేవాడు. బంగ్లాదేశ్ పై 8 వికెట్లు పడగొట్టడంతో అశ్విన్ 8వ స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ ఖాతాలో 522 వికెట్లు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో 800 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్, 708 వికెట్లతో వార్న్, 704 వికెట్లతో అండర్సన్, 619 వికెట్లతో అనిల్ కుంబ్లే, 604 వికెట్లతో బ్రాడ్, 563 వికెట్లతో మెక్ గ్రాత్, 530 వికెట్లతో లయన్ అశ్విన్ కంటే ముందు వరసలో ఉన్నారు.. ఇంకో తొమ్మిది వికెట్లు పడగొడితే అశ్విన్ లయన్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అయితే లయన్ రికార్డును అశ్విన్ తాజాగా అధిగమించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అతనికి సార్లు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఈ ఘనతను అతడు మొత్తం 11 సార్లు సాధించాడు. అతని తర్వాత లయన్ 10, కమిన్స్ 8, బుమ్రా 7, హజిల్ వుడ్ 6, సౌథి 6 సార్లు ఈ ఘనతను అందుకున్నారు.
అనేక రికార్డులు
భారత జట్టు తరఫున రవిచంద్రన్ అశ్విన్ నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు. అతడు మొత్తం చివరి ఇన్నింగ్స్ లలో 99 వికెట్లు పడగొట్టాడు . 94 వికెట్లతో ఈ జాబితాలో అనిల్ కుంబ్లే రెండవ స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం అశ్విన్ వయసు 38 సంవత్సరాలు. భారత జట్టు తరఫున టెస్ట్ మ్యాచ్ లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అత్యధిక వయసు ఉన్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 69 సంవత్సరాల క్రితం విను మన్కడ్ సృష్టించిన ఘనతను అతడు అధిగమించాడు.
టెస్టులలో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. 37 సార్లు అతడు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 101 టెస్ట్ లలో అశ్విన్ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (67) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. వార్న్ 37 సార్లు ఈ ఘనతను అందుకున్నప్పటికీ.. అతడు 143 టెస్ట్ లలో ఈ రికార్డు సృష్టించాడు.