Railway Stations: మన దేశంలో అతిపెద్ద రవాణా సెక్టార్ రైల్వే. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గానూ మన రైల్వే ఘనత సాధించింది. వేలాది రైళ్లు నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమతమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. మన ఇండియాలో 1.10 లక్షల కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. అలాగే.. దేశంలో చాలా మంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఏదైనా టూర్ వెళ్లాలన్నా.. దూర ప్రాంతాలకు వెళ్లలన్నా బస్సు మార్గంలో కాకుండా.. రైల్వే మార్గంలో చేరుకుంటారు. అలాగే.. రైల్వే ద్వారా వేలాది సంఖ్యలో ఉపాధి పొందుతున్న వారూ ఉన్నారు. అయితే.. దేశంలో ఇన్ని రైల్వే మార్గాలు.. ఇన్ని రైల్వే స్టేషన్లు ఉంటే ఎక్కడి నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు..? అక్కడి నిత్యం ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఎంత..? అనేది చాలా మందికి తెలియదు. ఒకసారి ఆ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం.
దేశంలో ఇప్పటికే వందేభారత్ రైళ్లు వచ్చాయి. తొలి బులెట్ రైలును సైతం వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతున్నారు. దాదాపు 7వేల రైల్వే స్టేషన్లు ఉండగా.. కొన్ని రైల్వే స్టేషన్ల నుంచి రైల్వే శాఖకు భారీగా ఆదాయం చేకూరుతోంది. ఇక ప్రయాణికుల సంఖ్య పరంగా చూస్తే ముంబయిలోనే థానే రైల్వేస్టేషన్ ముందు వరుసలో ఉంది. టాప్ ప్లేసులో నిలిచిన ఈ థానే రైల్వేస్టేషన్ నుంచి ఏటా దాదాపు 94 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తుంటారట. మరోవైపు.. ముంబయి పరిధిలోని కల్యాణ్ రైల్వేస్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. ఈ స్టేషన్ నుంచి ఏటా 84 మంది కోట్ల ప్రజలు ప్రయాణిస్తున్నారు. అలాగే.. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 40 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే.. తక్కువ మంది ప్రయాణికులతో న్యూఢిల్లీ మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఆదాయంలో మాత్రం ఫస్ట్ ప్లేసులో ఉంది.
ఢిల్లీ తరువాత కోల్‌కత్తా, చెన్నై రైల్వేస్టేషన్లు అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్లకు ప్రయాణికులతో కాకుండా సరుకుల రవాణా ద్వారా ఈ ఆదాయం వస్తోంది. సుమారు 70 శాతం ఆదాయం రవాణా ద్వారా పొందుతున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. ఇప్పటికే 1.10లక్షల కిలోమీటర్ల రైల్వే లైన్ ఉండగా.. దేశంలో ఇంకా చాలా చోట్ల ఇంకా రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతూనే ఉంది. వాటితో సంఖ్య మరింత పెరగనుంది.