Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Geetha Arts: మహేష్ బాబు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా...

Mahesh Babu Geetha Arts: మహేష్ బాబు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి..?

Mahesh Babu Geetha Arts: సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటుడు మహేష్ బాబు… చైల్డ్ ఆర్టిస్ట్ గా అదరగొట్టి ఆ తర్వాత హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపును సంపాదించుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. ఇప్పటికే రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ఈ సినిమాను చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా తెరకెక్కించాడనే వార్తలైతే వస్తున్నాయి. మహేష్ బాబు సైతం గతంలో ఎన్నడు లేనంతగా కష్టపడుతున్నారట. ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ మారబోతుంది అని కొంతమంది అంటుంటే, ఇంకొందరు మాత్రం మహేష్ బాబు టాప్ హీరోగా మారబోతున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి మహేష్ బాబు లాంటి నటుడు దొరికితే ఎవరైనా సరే ఇండస్ట్రీ హిట్ సినిమా తీయాలనే తాపత్రపడతారు. కానీ రాజమౌళి మాత్రం వరల్డ్ సినిమా స్థాయిని మెప్పించే సినిమా చేస్తుండడం విశేషం… ఇక మహేష్ బాబు కెరీర్ మొదటి నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

అల్లు అరవింద్ సైతం మహేష్ బాబు కోసం కథలను వెతుకుతున్నప్పటికి ఎప్పటికప్పుడు అది డిలే అవుతూనే వస్తుంది. నిజానికి మహేష్ బాబుకి గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయడం మొదట్నుంచి ఇంట్రెస్ట్ లేదట. అందువల్లే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని దాటవేస్తూ ముందుకు సాగుతున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: అల్లు శిరీష్ నైనిక రెడ్డి ని పెళ్లి చేసుకోవడానికి ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా..?

నిజానికి అల్లు అరవింద్ సినిమా సెలక్షన్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఒక మూవీ ఫ్లాప్ అయింది అంటే దాని తర్వాత నాలుగు సినిమాలు సక్సెస్ అయ్యే విధంగా ఆయన ప్రణాళిక రూపొందించుకుంటాడు. ఇక ఇలాంటి ఒక స్ట్రాటజీతో ఉండే అల్లు అరవింద్ గారి బ్యానర్లు మహేష్ చేయకపోవడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే ఆయనకు తగ్గ కథ వాళ్ళు తీసుకో రాకపోయి ఉండొచ్చు…

లేదంటే రెమ్యూనరేషన్ విషయంలో వాళ్లని ఆయన ఎక్కువగా డిమాండ్ చేయడం ఇష్టం లేక వాళ్లతో సినిమా చేయకుండా ఉంటేనే బెటర్ అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండేది అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version