Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ ప్రాంతంలో రైల్వే పట్టాలపై గ్యాస్ సిలిండర్ అమర్చారు. దీనిని ఢిల్లీ – హౌరా రైలుపై రైల్వే స్టేషన్ పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన ప్రేమ్ పూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను గుర్తించే సమయంలో లూప్ లైన్ మార్గంలో కాన్పూర్ ప్రాంతం నుంచి ప్రయాగ్ రాజ్ కు గూడ్స్ రైలు ప్రయాణిస్తోంది. ఒక ఎక్స్ ప్రెస్ రైలుకు మార్గం సుగమం చేసే క్రమంలో ఆ రైలును ఆపారు. ఆ సమయంలో లోకో పైలట్ సిలిండర్ ను గమనించాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఇది మాత్రమే కాదు ఇటీవల ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు విద్రోహ శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వారి ఆటలు ఇకపై సాగబోవని హెచ్చరించారు. ఆయన అలాంటి హెచ్చరికలు చేసినప్పటికీ కాన్పూర్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ రైలు పట్టాలపై పడి ఉండడం విశేషం.
పసిగట్టకపోయి ఉంటే..
ప్రయాగ్ రాజ్ నుంచి భివాని ప్రాంతానికి కాళింది ఎక్స్ ప్రెస్ వెళ్తోంది. కాన్పూర్ సమీపంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఢీకొట్టింది. ట్రాక్ పై సన్మానస్పద వస్తువు ఉన్నట్టు లోకో పైలట్ గుర్తించాడు. వెంటనే అత్యవసరమైన బ్రేకులు వేశాడు. ఎప్పటికీ ఆ రైలు సిలిండర్ ను ఢీ కొట్టింది. ఫలితంగా అది కొంత దూరంలో ఎగిరి పడింది. రైలుకు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీనిపై లోకో పైలట్, రైల్వే గార్డు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ పట్టాలకు సమీపంలో ధ్వమసమైన సిలిండర్, పెట్రోల్ నిండిన ప్లాస్టిక్ బాటిల్, అగ్గిపెట్టె, నాలుగు గ్రాముల పేలుడు పదార్థం లభించాయి. ఇక అజ్మీర్ సమీపంలోని పట్టాలపై సిమెంట్ బ్లాక్స్ ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
విద్రోహశక్తుల పని
రైళ్లను ప్రమాదాలకు గురి చేసేందుకు విద్రోహ శక్తులు ఇటీవల కుట్రలకు పాల్పడుతున్నాయి. గత నెల నుంచి ఇప్పటివరకు దాదాపు ఈ తరహా సంఘటనలు 18 వరకు జరిగాయి. విద్రోహ శక్తులు పట్టాలపై గ్యాస్ సిలిండర్లను, సైకిళ్లను, ఇనుప రాడ్లను, సిమెంట్ ఇటుకలను పెడుతున్నారు. రైళ్ల రాకపోకలకు ప్రమాదం వాటిల్లేలాగా చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఈ తరహా ఘటనలు 24 వరకు జరిగాయని భారత రైల్వే నివేదిక ఇటీవల ప్రకటించింది. ఈ ఘటనలు ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో చోటుచేసుకున్నాయని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి కుట్రపూరిత దుర్మార్గాలు వెలుగు చూశాయి. ఇలాంటి ఘటన వల్ల ఆగస్టు నెలలో కాన్పూర్ సమీపంలోని సబర్మతి ఎక్స్ ప్రెస్ లు 20 బోగీలు పట్టాలు తప్పాయి. ట్రాక్ పైన ఒక ఇనుప వస్తువును ఉంచడంతో ఈ ఘటన జరిగిందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇక ఆదివారం కాన్పూర్, రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగు చూసాయి.