https://oktelugu.com/

చెన్నై ఫ్యాన్స్ భావోద్వేగం.. గెలిచినా-ఓడినా CSKతోనే..!

కరోనా టైంలోనూ ఐపీఎల్-2020 క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏడారి దేశంలో ప్రారంభమైన ఐపీఎల్-2020 చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు క్వాలీ ఫై అయ్యే జట్లపై క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రతీసారి ప్లే ఆఫ్ కు చేరే చెన్నై జట్టు ఈసారి అభిమానులను నిరాశపరిచింది. Also Read: ఆ‘రేంజ్‌ ఆర్మీ’.. లాస్ట్ పంచ్ లో సన్ ‘రైజర్స్’ తొలి ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్(CSK) అభిమానులను అద్ఫుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 02:58 PM IST
    Follow us on

    కరోనా టైంలోనూ ఐపీఎల్-2020 క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏడారి దేశంలో ప్రారంభమైన ఐపీఎల్-2020 చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు క్వాలీ ఫై అయ్యే జట్లపై క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రతీసారి ప్లే ఆఫ్ కు చేరే చెన్నై జట్టు ఈసారి అభిమానులను నిరాశపరిచింది.

    Also Read: ఆ‘రేంజ్‌ ఆర్మీ’.. లాస్ట్ పంచ్ లో సన్ ‘రైజర్స్’

    తొలి ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్(CSK) అభిమానులను అద్ఫుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. అయితే ఈసారి మాత్రం చెన్నై జట్టు తొలి నుంచి తడబడుతున్నట్లుగా కన్పించింది. ప్రత్యర్థి జట్లను తన వ్యూహాలతో కట్టడి చేసే చెన్నై జట్టు కెప్టెన్ ధోని పాచికలు పారలేదు. దీంతో చెన్నై జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుండానే నిష్క్రమించాల్సి వస్తోంది.

    ఇప్పటికే 11మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం మూడింట్లోనే గెలుపొందింది. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ పది వికెట్ల తేడాతో ఓడటం ఇదే తొలిసారి. గత పది సీజన్లలో అద్భుత విజయాలతో ఫ్యాన్స్ అలరించిన ధోనీ సేన అనుహ్యంగా ఓటమి పాలవుతుండటంతో పలువురు ధోని, ప్రాంచేజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    అయితే యెల్లో డై హార్డ్స్ ఫ్యాన్స్ మాత్రం తాము ఎప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులమేనని చాటుతున్నారు. అంతేకాకుండా చెన్నై జట్టును ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ను ట్రోల్ చేయడానికి ఇతర జట్లకు 13ఏళ్లు పట్టిందని గణంకాలతో సహా ఓ అభిమాని కామెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.

    Also Read: గబ్బర్‌‌ ది గ్రేట్‌.. ధావన్ వరుస సెంచరీల రికార్డ్

    మరికొందరు డై హార్డ్స్ ఫ్యాన్స్ ‘మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం మహీ.. ఓటమిలోనూ.. గెలుపులోనూ నీతోనే’ ఉంటామంటూ చెన్నై టీమ్.. ధోనిపై వారికున్న ప్రేమను చాటుకుంటున్నారు. కొద్దిరోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనికి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పచ్చు. వచ్చే ఏడాదైనా ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కప్ సాధిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!