https://oktelugu.com/

గర్జించిన ‘కొమురంభీం’.. రికార్డులన్నీ బద్దలు..!

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదరు చూశారో అందకి తెల్సిందే.. ఈనెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రకటించగానే అభిమానులు ఖుషీ అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ టీజర్ అనుకున్న దానికంటే ఎక్కువగానే గర్జించినట్లు తెలుస్తోంది. Also Read: ట్రైలర్ టాక్: కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’గా ఎలా మారిందంటే? ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లో ట్రెండింగులోకి దూసుకెళ్లింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 02:54 PM IST
    Follow us on

    ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదరు చూశారో అందకి తెల్సిందే.. ఈనెల 22న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రకటించగానే అభిమానులు ఖుషీ అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ టీజర్ అనుకున్న దానికంటే ఎక్కువగానే గర్జించినట్లు తెలుస్తోంది.

    Also Read: ట్రైలర్ టాక్: కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’గా ఎలా మారిందంటే?

    ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లో ట్రెండింగులోకి దూసుకెళ్లింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ట్రెండింగ్ అయింది. గతంలో విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ కు ధీటుగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఉందనే టాక్ వచ్చింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.

    ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లో ఎన్టీఆర్ మేకోవర్ అయిన తీరును చూసి అభిమానులు సర్ ప్రైజ్ అయ్యారు. టీజర్లో ఎన్టీఆర్ విన్యాసాలకు రాంచరణ్ వాయిస్ తోడవడం హైలట్ గా నిలిచింది. ఇక టీజర్ చివర్లో కొమురంభీంను ముస్లిం గెటప్ చూపించడం వివాదస్పదమైంది. దీంతోపాటు జక్కన్న కొన్ని సీన్స్ కాపీ కొట్టడనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ టీజర్ ట్రోలింగ్ బారినపడింది.

    ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త రికార్డులను సృష్టించి ఎన్టీఆర్ సత్తాను మరోసారి అభిమానులకు చూపించింది. అత్యంత వేగంగా వన్ మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్ గా ‘రామరాజు ఫర్ భీమ్’ నిలిచింది. తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషలో ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రికార్డుల మోతమోగించినట్లు తెలుస్తోంది.

    Also Read: బన్నీ పిల్లల ‘ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ’ వైరల్..!

    తాజా గణాంకాల ప్రకారం చూస్తే తెలుగులో ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కు 17.54మిలియన్ల వ్యూస్ రాగా వన్ మిలియన్ లైకులు వచ్చాయి. అదేవిధంగా హిందీలో 5.89మిలియన్ వ్యూస్ రాగా 391k లైక్స్.. తమిళంలో 2.04 మిలియన్ల వ్యూస్ రాగా 177k లైక్స్.. మలయాళంలో 1.87మిలియన్ వ్యూస్ రాగా 134k లైక్స్.. కన్నడలో 1.60మిలియన్ల వ్యూస్ రాగా 130k లైక్స్ వచ్చాయి. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే మరిన్ని రికార్డులను ‘కొమురంభీమ్’ కొల్లగొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.