SRH Vs RR Qualifier 2: అతడిని రంగంలోకి దింపితే రాజస్థాన్ కు చుక్కలే.. హైదరాబాద్ దే గెలుపు..

క్వాలిఫైయర్ -1 లో ఓడిపోయినప్పటికీ హైదరాబాద్ జట్టుకు మరొక అవకాశం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అయితే క్వాలిఫైయర్ -2 లో ఓడిపోతే ఆ అవకాశం కూడా ఉండదు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 24, 2024 2:04 pm

SRH Vs RR Qualifier 2

Follow us on

SRH Vs RR Qualifier 2: లీగ్ దశలో అద్భుతంగా ఆడిన హైదరాబాద్ జట్టు క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో తేలిపోయింది. గల్లి స్థాయి ఆట తీరు ప్రదర్శించి కోల్ కతా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలుపొందిన రాజస్థాన్ జట్టుతో పోరాడాల్సిన పరిస్థితి హైదరాబాద్ జట్టుకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా రాజస్థాన్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్ ఫైనల్ వెళ్తుంది. కోల్ కతా తో కప్ ఫైట్ చేస్తుంది. లేకుంటే మూడో స్థానంతో సరిపెట్టుకుంటుంది. హైదరాబాద్ జట్టు క్వాలిఫైయర్ -1 లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో విఫలమైంది. కీలకమైన క్యాచ్ లు వదిలివేడంతో కోల్ కతా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. అతడు ఇచ్చిన క్యాచ్ లను హైదరాబాద్ ఆటగాళ్లు పట్టుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. ఆ మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాళ్లు విఫలం కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది.

క్వాలిఫైయర్ -1 లో ఓడిపోయినప్పటికీ హైదరాబాద్ జట్టుకు మరొక అవకాశం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అయితే క్వాలిఫైయర్ -2 లో ఓడిపోతే ఆ అవకాశం కూడా ఉండదు. అప్పుడు నేరుగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హైదరాబాద్ జట్టు రాజస్థాన్ జట్టుతో జరిగే కీలకమైన మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంది. అలా జరగని పక్షంలో ఆ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటింగ్ దారుణంగా ఉంది. ఓపెనర్లు సరిగ్గా ఆడక పోవడంతో.. ఆ ప్రభావం జట్టు స్కోరు మీద చూపించింది. ఓపెనర్లు త్వరగా అవుట్ కావడంతో మిడిల్ ఆర్డర్ కూడా తడబడింది. ఫినిషింగ్ టచ్ ఇచ్చే వాళ్ళు కూడా సైలెంట్ కావడంతో.. హైదరాబాద్ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఫలితం పునరావృతం కాకుండా ఉండేందుకు ఇన్నాళ్లు బెంచ్ కు పరిమితమైన ఆటగాడికి అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

హైదరాబాద్ జట్టులో ప్రమాదకరమైన ఆటగాడిగా పేరుపొందిన గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అతడు బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ కూడా చేస్తాడు. చిరుత వేగంతో ఫీల్డింగ్ చేస్తాడు. చెన్నై మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది కాబట్టి.. ఫిలిప్స్ అద్భుతాలు చేయగలడని అభిమానులు భావిస్తున్నారు. హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి.. ఈ సమయంలో అతడిని మైదానంలోకి దింపితే ఫలితం ఉంటుందని అభిమానులు అంటున్నారు. అతడిని ప్రయోగిస్తే రాజస్థాన్ జట్టు చిత్తయిపోతుందని అంచనా వేస్తున్నారు.. అయితే కెప్టెన్ కమిన్స్ ఫిలిప్స్ ను తీసుకుంటాడా? లేక మార్క్రం వైపు మొగ్గు చూపుతాడా అనేది తేలాల్సి ఉంది. బలమైన రాజస్థాన్ జట్టును ఓడించాలంటే హైదరాబాద్ స్థాయికి మించిన ప్రదర్శన చేయాలి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ లో చాలా మెరుగుపడాలి.. అప్పుడే హైదరాబాద్ రాజస్థాన్ జట్టును జయిస్తుంది. దర్జాగా ఫైనల్ లోకి అడుగుపెడుతుంది.