spot_img
Homeఎంటర్టైన్మెంట్Jabardasth comedian: దర్శకుడిగా మరో జబర్దస్త్ కమెడియన్... హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Jabardasth comedian: దర్శకుడిగా మరో జబర్దస్త్ కమెడియన్… హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Jabardasth comedian: జబర్దస్త్ వేదికగా అనేక మంది సామాన్యులు సెలెబ్రిటీలు అయ్యారు. కొందరు స్టార్స్ గా ఎదిగారు. అనసూయ, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను… ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంది. పలువురు కమెడియన్స్ గా సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరో అయ్యాడు. ఓ హిట్ కూడా కొట్టాడు. గెటప్ శ్రీను త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రాజు యాదవ్ టైటిల్ తో తెరకెక్కిన చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది.

కాగా ఈ జబర్దస్త్ కమెడియన్స్ లో డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు వేణు వండర్స్ టీమ్ లీడర్ గా ఉన్న వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించిన బలగం సంచలన విజయం సాధించింది. తెలంగాణ సంస్కృతిని, పల్లె జీవనాన్ని చక్కగా చూపించాడు వేణు. మూవీ అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ కావడంతో భారీ హిట్ కొట్టింది. వేణు స్ఫూర్తితో ధనాధన్ ధన్ రాజ్ కూడా దర్శకుడు కానున్నాడు.

ఆయన దర్శకత్వం వహించిన రామం రాఘవం మూవీ త్వరలో విడుదల కానుంది. కాగా మరో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టనున్నాడు. అది ఎవరో కాదు ఆటో రామ్ ప్రసాద్. సుడిగాలి సుధీర్ టీమ్ మెంబర్స్ లో ఆటో రామ్ ప్రసాద్ ఒకడు. ఆయన సుడిగాలి సుధీర్ టీమ్ కి స్కిట్స్ అందిస్తాడు ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఈ ముగ్గురు కలిశారంటే నవ్వులు పూయాల్సిందే.

ప్రస్తుతం ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే ఆ టీమ్ లో ఉన్నాడు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ కి దూరం అయ్యారు. కాగా ఆటో ప్రసాద్ దర్శకుడు అవుతున్నాడట. అతడు మెగా ఫోన్ పట్టనున్నాడట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇక ఆటో రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించే చిత్రంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్నాడట. అలాగే గెటప్ శ్రీను కూడా మరో హీరోనట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Exit mobile version