Suryakumar Yadav: వన్డేల్లో ఫెయిల్.. టీ20లో సూపర్ హిట్.. సూర్య మార్పునకు కారణాలేంటి..?

ఇండియా టీం ఒక్క బాల్ మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేదించి మొదటి మ్యాచ్ లోనే ఘనమైన విక్టరీని సాధించింది.ముందుగా యంగ్ ప్లేయర్ల తో ఉన్న ఇండియన్ టీం ఏ మాత్రం ఆస్ట్రేలియా టీం మీద ప్రతిభ చూపించలేదు అంటూ చాలామంది విమర్శించారు.

Written By: Gopi, Updated On : November 24, 2023 12:41 pm

Suryakumar Yadav

Follow us on

Suryakumar Yadav: వన్డే వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఆస్ట్రేలియా మీద ఫైనల్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది.ఇక అందులో భాగంగానే అభిమానులందరూ కూడా తీవ్రమైన నిరాశలో మునిగిపోయారు ఇక ఇలాంటి టైంలో టి20 సిరీస్ లకు భారత్ సిద్ధమైంది ఇక ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ ,రోహిత్ శర్మ లకు రెస్ట్ ఇచ్చి యంగ్ ప్లేయర్ అయిన సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఆస్ట్రేలియా మీద సీరీస్ కి టీమ్ ని రెఢీ చేశారు.ఇక నిన్న మొదటి టి20 మ్యాచ్ ఆడిన ఇండియన్ టీం అద్భుతమైన విక్టరీని సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకి ఆస్ట్రేలియా టీం 208 పరుగులు చేసింది.

ఇక ఇండియా టీం ఒక్క బాల్ మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేదించి మొదటి మ్యాచ్ లోనే ఘనమైన విక్టరీని సాధించింది.ముందుగా యంగ్ ప్లేయర్ల తో ఉన్న ఇండియన్ టీం ఏ మాత్రం ఆస్ట్రేలియా టీం మీద ప్రతిభ చూపించలేదు అంటూ చాలామంది విమర్శించారు అయినప్పటికీ సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలోని ఈ టీం మొదటి గెలుపును సాధించి చూపించింది. ఫైనల్ లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయినందుకు గాను ఈ గెలుపు ఒక చిన్నపాటి రివేంజ్ గా అభిమానులు భావించి సంబరాలు జరుపుకుంటున్నారు…

నిన్న చాలా ఎక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ చాలా సునాయాసంగా ఆ స్కోర్ ను చేదించగలిగింది అంటే అందులో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాత్ర చాలా ఉందనే చెప్పాలి. 209 భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయిన కూడా సూర్య ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూ 80 పరుగులు చేసి ఇండియన్ టీం విజయం లో కీలక పాత్ర వహించాడు… ఇక సూర్య కుమార్ యాదవ్ ఆటను చూసిన అభిమానులందరూ వరల్డ్ కప్ ఫైనల్లో ఆడింది ఈ సూర్య నేనా అనే అంత రేంజ్ లో సూర్య కంబ్యాక్ ఇస్తు భారీ షాట్స్ ఆడుతూ ప్రేక్షకులందరినీ అలరించాడు.

ఇంతకు ముందు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా మీద చివర్లో వచ్చిన సూర్య క్లాస్ ఇన్నింగ్స్ ఆడి ఇండియన్ టీం కి భారీ పరుగులు చేస్తాడు అనుకుంటే ఆయన ఏ మాత్రం ప్రతిభ చూపించలేకపోయాడు.ఇక దాంతో ఇండియన్ టీం ఓడిపోవాల్సి వచ్చింది కానీ టి20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టాడు సూర్య వన్డే కంటే కూడా టి 20 అంటే చెలరేగి అడుతాడు ఇప్పుడనే కాదు తను మొదటి నుంచి ఇదే వైఖరి కనబరుస్తూ వస్తున్నాడు…ఇక సూర్య టి 20 ల్లో భారీ విద్వంసం సృష్టిస్తాడు అనడానికి నిన్న జరిగిన మ్యాచ్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…ఇక ఐదు టి 20 మ్యాచ్ ల్లో ఇండియన్ టీమ్ మొదటి విక్టరీని సాధించింది కాబట్టి ఇంకొక రెండు మ్యాచ్ ల్లో గెలిచి సీరీస్ ని కైవసం చేసుకోవడం పెద్ద కష్టమైతే కాదు ఇక మిగితా మ్యాచ్ ల్లో ఎలా ఆడతారో చూడాలి…