Director Ravindra: నిర్మాతకు అమ్మాయిలను వల వేసిన దర్శకుడు..చివరకు ఊహించని ట్విస్ట్

ఓ యువతి పన్నిన వలలో చిక్కిన నిర్మాత విలవిలలాడాడు. ఈ ఘటన బెంగళూరు లో జరిగింది. అయితే ఆలస్యం అమృత విషం అనుకున్న నిర్మాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు దీని వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేయించారు? అనే వివరాలను కనిపెట్టారు పోలీసులు.

Written By: Suresh, Updated On : November 24, 2023 12:38 pm

Director Ravindra

Follow us on

Director Ravindra: ఈ మధ్య కొత్త రకం స్కామ్ లు, దోపిడీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సైబర్ నేరగాళ్లు మాస్టర్ ప్లాన్ వేసి మరీ దోచుకుంటున్నారు. చైన్ స్నాచ్ లు, బ్యాంక్ దొంగలు, ఇళ్లలో చోరీ ఇలా పద్దతి ఏదైనా కానీ వారి గమ్యం ఒక్కటే. డబ్బులు అడ్డదారిన సంపాదించడమే వారి ఆశ. దాని కోసం ఏదైనా చేయడానికి తెగిస్తారు. అయితే అందరినీ వారి సినిమాల ద్వారా అలర్ట్ చేయాలనుకునే దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి వలలో చిక్కుకుంటారు. ఇప్పుడు అదే విధంగా ఓ నిర్మాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఓ యువతి పన్నిన వలలో చిక్కిన నిర్మాత విలవిలలాడాడు. ఈ ఘటన బెంగళూరు లో జరిగింది. అయితే ఆలస్యం అమృత విషం అనుకున్న నిర్మాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు దీని వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు చేయించారు? అనే వివరాలను కనిపెట్టారు పోలీసులు. అమ్మాయిలను ఎర వేసి నిర్మాత నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. అయితే ఈయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి అవడం ఆశ్యర్యం.

నిర్మాత నుంచి డబ్బుల కోసం అమ్మాయిలను వలవేసింది ఎవరో కాదు దర్శకుడు రవీంద్ర అని గుర్తించారు పోలీసులు. యువతులు సాయంతో లైంగిక బెదిరింపులకు పాల్పడి, నిర్మాతల నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించాడని తెలిపారు పోలీసులు. నిర్మాత మహదేవ్ వద్దకు యువతులను పంపించి డబ్బు కోసం బెదిరించారనే ఆరోపణలను పరిగణలోకి తీసుకొని రవీంద్ర ఆటకట్టించారు. తనకు ఎదురైన ఇబ్బందిని బాధిత నిర్మాత పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. చింగారి, శ్రీకంఠ, శిశిర తదితర సినిమాలకు మహాదేవ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక నిందితుడు రవీంద్ర బార్ బాత్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.