India Vs Australia T20 2023: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 : ఇదేం చూపించడం.. జియో కంటే హాట్ స్టార్ 100 రెట్లు నయం..

రెండు కోట్ల మంది వినియోగించినందుకే జియో యాప్ అనేది ఇలా స్ట్రక్ అయితే వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌‌ను 5.9 కోట్ల మంది చూసిన కూడా ఆ యాప్ స్ట్రక్ అవ్వలేదు జియోసినిమా యాప్ కంటే హాట్ స్టార్ చాలా బెటర్ అనే విధంగా హాట్ స్టార్ మీద ప్రశంశలు కురిపిస్తున్నారు.

Written By: Gopi, Updated On : November 24, 2023 12:50 pm

India Vs Australia T20 2023

Follow us on

India Vs Australia T20 2023: ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియన్ టీమ్ భారీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు విపరీతమైన పోటీపడుతుండగా ఈ మ్యాచ్ ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి జియో సినిమా యాప్ పర్మిషన్లు తీసుకుంది. అందుకు తగ్గట్టు గానే అందరికీ ఫ్రీ అనే రేంజ్ లో హామీలు ఇచ్చి జియో సినిమా ఈ మ్యాచ్ ని టెలికాస్ట్ చేయడానికి నిశ్చయించుకుంది. అయితే ఈ యాప్ ని ఓపెన్ చేసిన ప్రతి క్రికెట్ అభిమానికి కూడా తీవ్రమైన నిరాశ ఎదురయింది. ఎందుకంటే ఈ యాప్ లో మ్యాచ్ చూద్దామని ఓపెన్ చేసిన అసలు ఓపెన్ అవ్వకుండా ఎర్రర్ రావడంతో మ్యాచ్ చూడాలనుకున్న ప్రతి అభిమాని కూడా జియో సినిమా పైన తీవ్రమైన ఆగ్రహానికి గురవుతున్నారు.

ఇక కేవలం రెండు కోట్ల మంది వినియోగించినందుకే జియో యాప్ అనేది ఇలా స్ట్రక్ అయితే వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌‌ను 5.9 కోట్ల మంది చూసిన కూడా ఆ యాప్ స్ట్రక్ అవ్వలేదు జియోసినిమా యాప్ కంటే హాట్ స్టార్ చాలా బెటర్ అనే విధంగా హాట్ స్టార్ మీద ప్రశంశలు కురిపిస్తున్నారు.ఇక ఇన్నాళ్లు ప్రపంచకప్ మ్యాచ్‌లను హాట్‌స్టార్‌లో వీక్షించిన అభిమానులు…జియో సినిమా తీరుకి విసిగిపోయారు

జియో సినిమా ఫ్రీ గా ఇస్తున్నాం అని డబ్బా కొట్టుకోవడం కాదు. కంటెంట్ క్వాలిటీ గా ఉండేలా డిజైన్ చేసుకోండి అప్పుడే జనాలకి మీరు ఫ్రీ గా ఇచ్చే కంటెంట్ నచ్చుతుంది. అంతే కానీ ఫ్రీ ఇస్తున్నాం అని ఇలా అభిమానులతో ఆడుకోవడం మంచిది కాదు అంటూ చాలా మంది అభిమానులు జియో సినిమా వాళ్ళకి సలహాలను ఇస్తున్నారు…ఇక దాంతో పాటు జియో సినిమా యాప్ స్ట్రక్ అవ్వడానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దాంతో ఎక్స్‌లో జియోసినిమా యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.ఇలా అభిమానులతో ఆడుకుంటే వాళ్ళు కూడా ఇలా చెలరేగి మీ యాప్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటారు అని మరికొంత మంది అభిప్రాయ పడుతున్నారు…

ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీమ్ తమదైన రీతిలో చెలరేగి ఆడి సులభంగా విజయాన్ని దక్కించుకుంది… ఇక ఇలాంటి సమయంలో ఇండియన్ టీమ్ తమ సత్తా చాటే అవసరం ఉంది కాబట్టి సత్తా చాటి మరోసారి మన ఇండియన్ టీమ్ పవర్ ఏంటో ప్రూవ్ చేసుకుంది…ఇక ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియా ఒక సూపర్ విక్టరీ ని నమోదు చేసుకుంది…