https://oktelugu.com/

PAK vs BAN : రెచ్చిపోయిన బంగ్లా బౌలర్లు.. మరో ఓటమి దిశగా పాకిస్తాన్..

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్.. మరో విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తొలి టెస్ట్ లో పాకిస్థాన్ పై 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇక రెండో టెస్టులోనూ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 2, 2024 / 08:32 PM IST

    PAK VS BAN 2nd Test Match

    Follow us on

    PAK vs BAN :  టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పాకిస్తాన్ జట్టుపై తొలిసారి పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. రెండవ టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఏకంగా పాకిస్తాన్ జట్టును స్వదేశంలో 2-0 తేడాతో ఓడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అనితర సాధ్యమైన ఆటతీరుతో రెండవ టెస్టులో గెలుపే లక్ష్యంగా పాకిస్తాన్ ముందుకు సాగుతోంది. సోమవారం నాడు నాలుగో రోజు ఆటోలో భాగంగా పాకిస్తాన్ జట్టును రెండవ ఇన్నింగ్స్ లో 172 పరుగులకు అలౌట్ చేసి బంగ్లాదేశ్ జట్టు రెండవ టెస్టుపై పట్టు బిగించింది. బంగ్లాదేశ్ పేస్ బౌలర్ హసన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ రాణా నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ సాధించాడు. పాక్ జట్టులో కీలక బ్యాట్స్ మెన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 8వ స్థానంలో వచ్చిన ఆఘా సల్మాన్ 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు పాకిస్తాన్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ షాన్ మసూద్ 28 పరుగులు చేశాడు. వికెట్ కీపర్, బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా ఆటగాళ్లు కనీసం 20 పరుగుల స్కోర్ కూడా చేయలేకపోయారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు టీ విరామ సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 37 రన్స్ చేసింది. బంగ్లాదేశ్ గెలుపుకు ఇంకా 148 పరుగులు కావాల్సి ఉంది.

    లిటన్ దాస్ సరికొత్త చరిత్ర

    అంత ముందు తొలి ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ 262 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఒకానొక దశలో బంగ్లాదేశ్ 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం అందరిలో కలిగింది. ఈ సమయంలో బంగ్లాదేశ్ జట్టును లిటన్ దాస్ ఆదుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. పాకిస్తాన్ పేస్ బౌలర్ల జోరుకు కళ్లెం వేసాడు. 228 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 138 రన్స్ చేసిన దాస్.. హసన్ మిరాజ్ తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిరాజ్ కూడా 124 బంతుల్లో 78 రన్స్ చేశాడు. అతడు ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. వీరిద్దరూ ఏడవ వికెట్ కు ఏకంగా 165 రన్స్ జోడించారు. ఫలితంగా బంగ్లాదేశ్ పటిష్ట స్థితిలో నిలిచింది.. కెప్టెన్ షాంటో(4), మోమినుల్ హక్ (1), రహీం (3), షకీబ్ అల్హాసన్ (2), జాకీర్ హసన్(1), షాద్ మాన్(10) దారుణంగా విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో షహజాద్ ఆరు వికెట్లు పడగొట్టాడు.. మీరు హమ్జా, సల్మాన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 172 రన్స్ కే కుప్పకూలిది.. అదే అంతకుముందు వర్షం వల్ల పాకిస్తాన్ – బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో భాగంగా పాకిస్తాన్ స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో రెండు మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ పది వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. రావల్పిండి లో జరుగుతున్న రెండోవ టెస్ట్ లోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. మరోవైపు రెండో టెస్టులో విజయం సాధించాలని పాకిస్తాన్ పట్టుదలగా ఉంది. తద్వారా సిరీస్ 1-1 తో సమం చేయాలని భావిస్తోంది.