https://oktelugu.com/

iPhone : శత్రు దుర్భేద్యమైన కంటైనర్.. అందులో 12 కోట్ల విలువైన ఐఫోన్లు.. దుండగులు ఎలా చోరీ చేశారంటే..

ఐఫోన్.. చాలామంది దానొక స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. ఐఫోన్ వాడడాన్ని సామాజిక హోదాగా పరిగణిస్తుంటారు. కొంతమంది నెల నెలా ఈఎంఐ చెల్లించి మరి సొంతం చేసుకుంటారు. అలాంటి ఐఫోన్ లలో ప్రతి ఏడాది ఆపిల్ కంపెనీ కొత్త కొత్త వెర్షన్ లను విడుదల చేస్తుంటుంది. ఆపిల్ కంపెనీ ఐఫోన్లను తయారు చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే రవాణా చేసే వరకు ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్త వహిస్తుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 2, 2024 / 09:32 PM IST

    iPhone

    Follow us on

    iPhone : ఐఫోన్ తయారీని ఆపిల్ కంపెనీ పటిష్ట బందోబస్తు మధ్య చేపడుతుంది. ఐఫోన్ తయారీ కేంద్రాలలో ఏడు అంచల భద్రత ఉంటుంది. అందులో పని చేసే నిపుణులను ఎప్పటికప్పుడు ఆపిల్ కనిపెడుతూనే ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తుంది. తయారుచేసిన ఐఫోన్లను రవాణా చేసేందుకు కూడా ఆపిల్ అత్యంత పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తుంది. ఇంతటి వ్యవస్థ ఉన్నప్పటికీ కొంతమంది దుండగులు ఐఫోన్లను దొంగిలించేందుకు యత్నించారు. సుమారు 12 కోట్ల విలువైన ఐఫోన్లను చివరి చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐఫోన్లను అత్యంత పటిష్టమైన ట్రక్కు లో రవాణా చేస్తున్నారు. ఆ ట్రక్కు హర్యానా నుంచి చెన్నై వెళ్తోంది. మార్గమధ్యంలో మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ చోరీ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. సుమారు 1500 కి పైగా ఐఫోన్లను దుండగులు దొంగిలించారని తెలుస్తోంది. వాటి విలువ పన్నులు కోట్ల దాకా ఉంటుందని తెలుస్తోంది.

    ఆగస్టు 15న ఘటన

    ఆ చోరీ ఘటన ఆగస్టు 15న జరిగింగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానా నుంచి బయలు దేరిన ట్రక్కు గురుగ్రామ్ వచ్చింది. ఈలోగానే దుండగులు ఆ ట్రక్కు పై దాడి చేశారు. ట్రక్కు తొలుతున్న డ్రైవర్ కు మత్తు మందు ఇచ్చారు. అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ఆ ఫోన్లను చోరీ చేశారు. డ్రైవర్ మత్తు నుంచి తెరుకోగానే ట్రక్కును పరిశీలించగా అందులో ఐఫోన్ లు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రక్కులో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పై అతడు అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కూడా ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు ను విచారిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు ఈ ఘటనలో డ్రైవర్ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేయలేదు. వారిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. మొదట్లో డ్రైవర్ ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫోన్లు దొంగతనం చేసిన వ్యక్తులకు, పోలీస్ అధికారులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారీగా ఫోన్లు చోరీకి గురైన నేపథ్యంలో అంతర్జాతీయ ముఠా హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు.