https://oktelugu.com/

Vishnu priya : కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ కి వెళ్లను రాసిపెట్టుకోండి.. వైరల్ అవుతున్న విష్ణు ప్రియా పాత వీడియో

గతంలో విష్ణు ప్రియ బిగ్ బాస్ గురించి మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విష్ణు ప్రియా ఆ వీడియోలో ఏం మాట్లాడింది? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 2, 2024 / 08:19 PM IST

    Vishnu priya

    Follow us on

    Vishnu priya : బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. కొంతమంది అయితే బిగ్ బాస్.. లైఫ్ టైం డ్రీమ్ అని కూడా ఫీలవుతుంటారు. ఒక్క చిన్న ఛాన్స్ ఈ షో నుంచి వస్తే లైఫ్ ఇక మారిపోతుందని భావిస్తుంటారు. ఈ షో వల్ల మంచి ఆఫర్లు వస్తాయని.. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ షోపై కొందరు విమర్శలు కూడా చేస్తుంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బిగ్ బాస్ కొత్త సీజన్ తో సరి కొత్తగా వస్తూనే ఉంటుంది. ఈ ఏడాది సీజన్ 8 బిగ్ బాస్ ప్రారంభమైంది. అయితే ఈ సీజన్ లో ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ కూడా ప్రేక్షకులను అలరించునుంది. అయితే గతంలో విష్ణు ప్రియ బిగ్ బాస్ గురించి మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ విష్ణు ప్రియా ఆ వీడియోలో ఏం మాట్లాడింది? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుందాం.

    బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. మొత్తం 14 కాంటెస్టెంట్స్ తో సరి కొత్తగా స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సీజన్ లో యాంకర్ విష్ణు ప్రియా కూడా ఉంది. విష్ణు ప్రియ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తో కేరియర్ ను స్టార్ట్ చేసింది. ఆ తరువాత యాంకర్ గా పలు షోలో చేసింది. వీటితో పాటు యూట్యూబ్ లో డాన్స్ వీడియో లు కూడా చేసేది. అలాగే ఎప్పుడు సోషల్ మీడియా లో తన హాట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటాది. ఎప్పుడు ఎదో విధంగా సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే ఉంటుంది. అయితే విష్ణు ప్రియా గతంలో బిగ్ బాస్ కి వెళ్లను అని ఓ ఇంటర్వ్యూ లో చెబుతుంది. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఎన్ని కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లను. ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు.. మనం ఎందుకు ఒక ఇంట్లో ఉండాలి. ఇంట్లో వాళ్లు ఉన్నారు వాళ్లని చూసుకోవాలి. అయిన nenu చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ పర్సన్ కాదు. అసలు నేను బిగ్ బాస్ చూడను. నేను ఆ షోకి అసలు ఎంకరేజ్ కూడా చేయను. అసలు నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లను..రాసిపెట్టుకోండి. ఒకవేళ నేను వెళ్తే నన్ను నిందించండని ఆమె ఆ వీడియోలో అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

    ఎప్పుడు మనుషుల అభిప్రాయాలు ఒకేలా ఉండవు కదా. వాళ్ల అవసరాల బట్టి మారుతుంటాయి. బిగ్ బాస్ కి వెళ్తే ఇంకా ఎక్కువ ఫేమ్ రావడంతో పాటు డబ్బులు కూడా వస్తాయని ఆమె వెళ్లారు ఏమో. దీనికి కారణం ఏంటో తెలియాలంటే ప్రియా హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అడిగితేనే తెలుస్తుంది.

    &