WTC Final 2025: మొదటి స్థానంలో ఉన్నామని నిర్లక్ష్యం వద్దు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే.. ఎందుకంటే?

వరల్డ్ బెస్ట్ ఛాంపియన్ షిప్ మొదలై రెండు సీజన్లు పూర్తయింది. ఈ రెండు సీజన్లో భారత్ ఫైనల్ వెళ్ళింది. కానీ టైటిల్ సొంతం చేసుకోలేదు. ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని భావిస్తోంది. దానికంటే ముందు రోహిత్ సేన ఫైనల్ చేరాల్సి ఉంది. అయితే అది అంత ఈజీ కాదు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 12, 2024 9:41 am

WTC Final 2025(1)

Follow us on

WTC Final 2025: 2023 -25 సీజన్ కు సంబంధించి భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 68.5% విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. రోహిత్ సేన 9 మ్యాచ్ లు ఆడి 74 పాయింట్లు సొంతం చేసుకుంది. 12 మ్యాచ్ లు ఆడి 90 పాయింట్ సాధించిన ఆస్ట్రేలియా, 62.5 శాతం గెలుపు శాతంతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే భారత్ – ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తాయి. గతంలో మాదిరిగానే తలపడతాయి. ఇదే సమయంలో ఇతర జట్లు ఫైనల్ వెళ్లే అవకాశాలను తోసిపుచ్చడానికి లేదు. 19.1 విజయాలతో పాకిస్తాన్, 18.5 శాతం విజయాలతో వెస్టిండీస్ తప్ప మిగతా ఏడు జట్లూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో భావించాల్సి ఉంటుంది.

భారత జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

ఇక ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మిగతా జట్ల కంటే భారత్ ఎక్కువగా మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు, న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే ఇందులో భారత్ కనీసం ఐదు మ్యాచ్ లు గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. ఆరు విజయాలు సాధిస్తే ఫైనల్ చేరడానికి ఆస్కారం ఉంటుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో జరిగే సిరీస్ లను భారత్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ తర్వాత.. ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టుకు అంత సులభంగా ఉండకపోవచ్చు. గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియా జట్టును భారత్ ఓడించింది. అయితే ఈసారి భారత జట్టును ఎలాగైనా ఓడించాలని ఆస్ట్రేలియా జట్టు కృత నిశ్చయంతో ఉంది. ఒకవేళ భారత జట్టుకు ఆస్ట్రేలియా సిరీస్ లో వ్యతిరేక ఫలితాలు వచ్చి.. ఇతర జట్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తే.. అది భారత జట్టుకు లభించే అవకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ లో గెలిస్తే భారత్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఆస్ట్రేలియా జట్టును ఫైనల్ మ్యాచ్ కు దూరం చేసేందుకు ఆస్కారం ఉంటుంది.. సిరీస్ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లలో ఏది ఎలాంటి ఫలితం రాబడితే ఫైనల్ చేరొచ్చనే విషయంపై స్పష్టత వస్తుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ను దృష్టిలో పెట్టుకొని రెండు జట్లు ఆడతాయి. ఫలితంగా ఈ సిరీస్ మరింత ఉత్కంఠ గా సాగే అవకాశం ఉంది.