https://oktelugu.com/

Janhvi Kapoor: దేవర జాన్వీ కపూర్ కి కలిసి వస్తుందా..? ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అవుతుందా..?

తెలుగులో చాలా మంది కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు. అయినప్పటికి ఒక సోషల్ మేసేజ్ తో సినిమాను తీసి సక్సెస్ లను అందుకోవడంలో కొరటాల శివ ను మించిన డైరెక్టర్ మాత్రం మరొకరు లేరనేది వాస్తవం...

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 09:46 AM IST

    Janhvi Kapoor

    Follow us on

    Janhvi Kapoor: ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీయార్ తో కలిసి అత్యంత భారీ బడ్జెట్ తో చేస్తున్న ‘దేవర ‘ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని చాలా రిచ్ గా రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొరటాల కమర్షియల్ డైరెక్టర్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే అతని సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తూనే తను రాసుకున్న కథను ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా చాలా బాగా తెరకెక్కిస్తు ఉంటాడు.అందువల్లే ఆయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా స్టార్ హీరో తోనే కావడం విశేషం…అలాంటి కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమా మీద తను చాలా ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అందుకోసమే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా బ్యాక్ ఎండ్ లో కొరటాల శివ ఈ సినిమా కోసం భారీగా వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ‘అతిలోక సుందరి’ శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకి మరొక పెద్ద ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి.

    ఇక బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు పలు సినిమాలు చేసినప్పటికీ వాటి ద్వారా ఆమెకి పెద్దగా గుర్తింపైతే రాలేదు. కాబట్టి జాన్వీ కపూర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియాలో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోదామని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక కపూర్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.అలాగే జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవిలాగే స్టార్ హీరోయిన్ అవ్వాలి అనుకుంటుంది.

    కాబట్టి దేవర సినిమా ఎలాగైనా సక్సెస్ అయి ఆమెకు మంచి గుర్తింపును తీసుకొస్తేనే పాన్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. లేకపోతే మాత్రం జాన్వీ కపూర్ ని శ్రీదేవితో పోలుస్తూ చాలావరకు విమర్శలను చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది ఎన్టీఆర్, కొరటాల కంటే కూడా జాన్వీ కి చాలా కీలకం కబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఈ ఒక్క సినిమాతో సక్సెస్ అయితే ఆమె ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ గా మారుతుంది. లేదంటే మాత్రం ఆమెకి చాలా విమర్శలను ఎదుర్కోక తప్పదు. ఇక ఇప్పటికే బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక జాన్వీ లక్కీ హ్యాండ్ గా మారుతుందా? లేదంటే ఐరన్ లెగ్గుగా దర్శనమిస్తుందా? అనేది తెలియాలంటే దేవర సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…