Today 5 June 2025 Horoscope: గ్రహాల పరిస్థితి మారినప్పుడల్లా రాశులపై ప్రభావం పడుతుంది. ఈరోజు ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు అద్భుతమైన ఫలితాలు పొందనున్నారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థుల శుభవార్త వింటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. అధికారులు అప్పజెప్పిన పనిని ఉత్సాహంగా పూర్తి చేయాలి. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళికలు వేసి ఖర్చులు చేయాలి. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారు కొత్త వ్యక్తులను కలుస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. అనుకున్న సమయానికి కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది.
మిథున రాశి( మృగశిర 3,4 ఆరుద్ర): ఈ రాశి వారు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారులు కొన్ని ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే కొత్త భాగస్వాములతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఖర్చులను నియంత్రించుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. వీరు ఏ పని చేపట్టిన ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. ఖర్చులకోసం బడ్జెట్ ను రూపొందిస్తారు. మానసికంగా ఆందోళనగా ఉంటే కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అనవసరంగా కోపాన్ని తెచ్చుకోవద్దు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. అయితే ఇంట్లో విషయాలు భాగస్వాములకు చెప్పకుండా ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు లాభాలను తెస్తాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాపారులు కొన్ని పనులను పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల మధ్య తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మీరు గతంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల గురించి కీలక సమాచారం అందుకుంటారు. ఒక పని కోసం కష్టపడితే.. దాని నుంచి సరైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వాటిని ఓపికతో పరిష్కరించుకోవాలి. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై ప్రయాణించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మనసు ఆందోళనగా ఉండే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని వస్తువుల విషయంలో వెనుకడుగు వేయాలి. ఆర్థిక పరమైన పరిమితిని బట్టి ఖర్చులు చేయాలి. కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. కొత్తగా ప్రాజెక్టు చేపట్టే ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . కష్టపడి పనిచేసిన వారికి ఈరోజు సరైన ఫలితాలు పొందుతారు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక వ్యవహారాలను ఇతరులతో చెప్పకూడదు. ఇంటి నిర్మాణం కోసం కొన్ని ఖర్చులు చేస్తారు. బడ్జెట్ కు అనుగుణంగా ఫ్యూచర్ ప్లాన్ వేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు సిద్ధమవుతారు. ఉద్యోగులు తోటి వారితో కలిసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఏ పని చేసినా ఓర్పుతో ఉండాలి. కొందరు పనులకు అడ్డంకులు సృష్టిస్తే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఏమైనా తప్పులు చేస్తే వాటిని వెంటనే సరిదిద్దుకోవాలి. లేకుంటే సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రియమైన వారితో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాలపై ఎక్కువగా చర్చిస్తారు. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభిస్తే తోటి వారి సహాయం తీసుకుంటారు. వ్యాపారులు గతంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా డబ్బు అడుగుతే ఇచ్చేందుకు వెనకడుగు వేయాలి.