Eng Vs Ind 2nd Test Harry Brook: టెస్ట్ క్రికెట్లో 600 పైకి పరుగుల లక్ష్యాన్ని చేదించడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉండదు. పైగా బౌలర్లు రెచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్లే పరుగులు ఆ స్థాయిలో రావు. అయితే అరుదైన సందర్భాల్లో మాత్రం భారీగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓవర్ కు ఆరు పరుగులు చొప్పున రన్ రేట్ తో స్కోర్ చేయడం సాధ్యమవుతుంది. అయితే దీనిని ఇంగ్లాండ్ జట్టే నిరూపించింది. వంద ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 600 పైగా పరుగులు చేసింది. బజ్ బాల్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంగ్లాండ్ భారీగా పరుగులు చేస్తోంది. 600కు పైగా పరుగులు కూడా ఆకోవలోనివే.
Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!
నాడు ఇంగ్లీష్ జట్టు 600 పరుగులు చేయడం ఒక రికార్డు కాగా.. ఆ పరుగులను తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టు సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో ఆ స్థాయిలో పరుగులు చేయడం ఒక విశేషమే అయినప్పటికీ.. చేజింగ్లో మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే చేజింగ్ చేస్తున్న సమయంలో బ్యాటర్ల మీద ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తారు. ఆ బంతులను కాచుకుంటూ పరుగులు చేయడం అంత ఈజీ కాదు.. పైగా ప్రస్తుత మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. మిగతా బ్యాటర్లు దూకుడుగా ఆడేవారే అయినప్పటికీ.. భారత బౌలర్లు ఇప్పటికే జోరు మీద ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుకు ఆ పరుగులు చేజ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు.
కొండంత లక్ష్యాన్ని కూడా తమ ఫినిష్ చేస్తామని ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ వెల్లడించడం విశేషం. శనివారం మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ విధించిన లక్ష్యాన్ని పూర్తిచేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామని బ్రూక్ వ్యాఖ్యానించడం విశేషం. బ్రూక్ ఇదే టెస్టులో స్మిత్ తో కలిసి 300కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ బ్రూక్, స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి దూకుడు వల్ల ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు కు గట్టిగానే బదులిచ్చింది. అయితే బ్రూక్ అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ తదుపరి వికెట్లను కేవలం 20 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బ్రూక్ బీభత్సంగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో.. రెండవ ఇన్నింగ్స్ లోను అదే స్థాయిలో ఆడతామని అతడు వెల్లడించడం విశేషం.
ప్రస్తుతం బ్రూక్ కు అండగా పోప్ ఉన్నాడు.. వీరే కాకుండా స్టోక్స్, స్మిత్, కార్స్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ లెక్కన చూస్తే 7 వికెట్ల వరకు ఇంగ్లాండులో భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో ఏ జట్టు అయినా సరే డ్రా కోసం ఆడుతుంది. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు అలా కాదు. విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా బ్యాటింగ్ చేస్తుంటారు. అలాంటప్పుడు భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బ్రూక్ హెచ్చరికలను మామూలు మాటలు కాకుండా.. సీరియస్ గా తీసుకోవాలి. లేకుంటే మొదటి టెస్ట్ ఫలితమే రెండవ టెస్టులో వచ్చే ప్రమాదం ఉంది.