Japan Tsunami Prediction: అంధురాలైన బాబా వంగా చెప్పిన భవిష్యవాణిలో కొన్ని ఘటనలు జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆమె చెప్పినవన్నీ జరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో జూలై 5న మెగా సునామీ వస్తుందని కూడా భవిష్యవాణిలో రాసింది. దీంతో జపాన్ వాసులు వారం రోజులుగా ఆందోళన చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అయితే, జులై 6 రావడంతో జపాన్‌లో ఊహించిన సునామీ లేదా విపత్తు సంభవించలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతకీ ఎవరీ ర్యొ టట్సుకి ఎవరు?
ర్యొ టట్సుకి జపాన్‌లో జోస్యం చెప్పే వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత జోస్యం చెప్పే బాబా వాంగాతో పోల్చబడుతూ ఈ పేరు సంపాదించారు. ఆమె గతంలో కొన్ని సంఘటనలను సరిగ్గా ఊహించినట్లు చెపిపంది. అయితే ఆమె జోస్యాలు శాస్త్రీయ ఆధారాలపై కాక, అనుమానాలపై ఆధారపడి ఉంటాయి. టట్సుకి జపాన్‌లో 2025, జులై 5న భారీ సునామీ లేదా భూకంపం వంటి ప్రళయం సంభవిస్తుందని ఊహించారు, దీనితో సోషల్ మీడియాలో భయాందోళనలు వ్యాపించాయి.
Also Read: ఆ దేశ జనాభా ముగ్గురే.. విస్తీర్ణం 11 ఎకరాలు.. అతిచిన్న దేశం.. ప్రత్యేకతలు అనేకం..
ఎలాంటి ప్రళయం లేదు..
అయితే జులై 5న జపాన్‌లో చిన్న భూకంపాలు తప్ప, ఊహించిన సునామీ లేదా విపత్తు సంభవించలేదు. జపాన్ వాతావరణ శాఖ ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. భూ విన్యాసం వల్ల తరచూ చిన్న భూకంపాలు సంభవించడం సాధారణం. జులై 5న కూడా ఇలాంటి చిన్న భూకంపాలు రికార్డు అయినప్పటికీ, అవి ఎలాంటి నష్టాన్ని కలిగించలేదు. ఊహించిన విపత్తు సంభవించకపోవడంతో జపాన్ ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ జోస్యం గురించి ఆందోళన చెందిన వారు ఊపిరి పీల్చుకున్నారు.
జోస్యం ఊహాగానమేనా
శాస్త్రవేత్తల ప్రకారం, భూకంపాలు లేదా సునామీలను కచ్చితమైన తేదీలతో ఊహించడం సాంకేతికంగా సాధ్యం కాదు. జపాన్‌లో భూకంప కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే సంస్థలు ఎలాంటి అసాధారణ సంకేతాలను గుర్తించలేదు. జపాన్‌లోని భూగర్భ శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు టట్సుకి జోస్యాన్ని నిరాధారమైనదిగా కొట్టిపారేశారు. వారి ప్రకారం, ఇలాంటి ఊహాగానాలు శాస్త్రీయ ఆధారాల లేకపోవడం వల్ల నమ్మదగినవి కావు. ఈ జోస్యం సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపించడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. ఇది సమాచార విశ్వసనీయత గురించి మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది.