Homeక్రీడలుక్రికెట్‌IPL trophy Sanskrit shloka: ఐపీఎల్ ట్రోఫీ పై సంస్కృత శ్లోకం.. అందుకే ప్రత్యేకం.. ఇంతకీ...

IPL trophy Sanskrit shloka: ఐపీఎల్ ట్రోఫీ పై సంస్కృత శ్లోకం.. అందుకే ప్రత్యేకం.. ఇంతకీ దాని అర్థం ఏంటంటే..

IPL trophy Sanskrit shloka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ గతంలో ఒకే రకమైన ఆకృతిలో ఉండేది. ఆ తర్వాత దానిని మార్చేశారు. ప్రు డెన్షియల్ వరల్డ్ కప్ నమూనాలోనే దాన్ని రూపొందించారు. ఆకృతి కూడా అద్భుతంగా ఉండడంతో చాలా దేశాలు తాము నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్లలో ఇదేవిధంగా ఉండేలా ట్రోఫీని రూపొందిస్తున్నాయి. ఐపీఎల్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ ఏమాత్రం రాజీపడదు. నాణ్యమైన బంగారంతో దీనిని రూపొందిస్తూ ఉంటుంది. గెలిచిన జట్టు ఈ ట్రోఫీని అందుకుంటుంది. ఈ […]

IPL trophy Sanskrit shloka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ గతంలో ఒకే రకమైన ఆకృతిలో ఉండేది. ఆ తర్వాత దానిని మార్చేశారు. ప్రు డెన్షియల్ వరల్డ్ కప్ నమూనాలోనే దాన్ని రూపొందించారు. ఆకృతి కూడా అద్భుతంగా ఉండడంతో చాలా దేశాలు తాము నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్లలో ఇదేవిధంగా ఉండేలా ట్రోఫీని రూపొందిస్తున్నాయి.

ఐపీఎల్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ ఏమాత్రం రాజీపడదు. నాణ్యమైన బంగారంతో దీనిని రూపొందిస్తూ ఉంటుంది. గెలిచిన జట్టు ఈ ట్రోఫీని అందుకుంటుంది. ఈ ట్రోఫీకి స్పాన్సర్ గా టాటా కంపెనీ వ్యవహరిస్తోంది. గతంలో చైనా కంపెనీలు వ్యవహరించేవి. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దీంతో టాటా కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీకి ప్రధాన ప్రయోజక కర్తగా వ్యవహరిస్తుంది. ట్రోఫీ తయారీలో టాటా కంపెనీ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. పైగా అట్రోఫీని తమ ప్రౌడ్ మూమెంట్ గా ఆ కంపెనీ చెబుతోంది.

టాటా కంపెనీ బీసీసీఐకి ఎంత ఇస్తుందో తెలియదు గానీ.. ఐపీఎల్ ట్రోఫీకి టైటిల్ స్పాన్సర్ గా ఉండడంవల్ల ఆ కంపెనీ కి విపరీతమైన ప్రచారం లభిస్తుంది. అయితే ప్రొఫెషన్ లో అటు బీసీసీఐ, ఇటు టాటా కంపెనీ కాంప్రమైజ్ కావని చెప్పుకున్నాం కదా. ట్రోఫీ పై సంస్కృతంలో ఒక శ్లోకాన్ని రూపొందించింది టాటా కంపెనీ.. ఇందులో బీసీసీఐ ప్రమేయం కూడా ఉంది. ఆట్రోఫీని అత్యంత జాగ్రత్తగా గమనిస్తే సంస్కృతంలో యత్ర ప్రతిభా అవసర ప్రాప్నో తిహి అని రాసిన శ్లోకం కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ఎక్కడైతే ప్రతిభకు తగ్గట్టుగా అవకాశం దక్కుతుందో అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించి.. వారికి సమానమైన అవకాశాలు కల్పించడమే ఈ టోర్నీ ఉద్దేశం. 2008 నుంచి ఇప్పటివరకు నిర్వాహకులు ఇదే విధానానికి కట్టుబడి ఉన్నారు.. మరోవైపు ఆర్ సి బి ఈ సీజన్లో విజేతగా నిలిచిన నేపథ్యంలో ట్రోఫీ మీద బంగారు అక్షరాలతో రాయల్ చాలెంజర్స్ పేరును రూపొందించారు.

టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించిన దగ్గర్నుంచి ఐపీఎల్ రేంజ్ మారిపోయింది.. గ్లోబల్ వ్యాప్తంగా కూడా ఈ ట్రోఫీకి విపరీతమైన స్థాయి వచ్చేసింది. చాలామంది ప్లేయర్లు ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. భారీగా డబ్బు రావడం.. పేరు కూడా లభిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్లేయర్లు ఐపీఎల్ లో ఆడే అవకాశం వస్తే చాలు ఎగిరి గంతులు వేస్తున్నారు. ఆదాయానికి ఆదాయం.. పేరుకు పేరు వస్తున్న నేపథ్యంలో.. ఐపీఎల్ ను తమ టాప్ ప్రయారిటీగా ఆటగాళ్లు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper