https://oktelugu.com/

Cricket Australia : హెడ్ కోచ్ గా నియమిస్తే.. తన పాడు బుద్ధిని చూపించాడు.. క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసిందంటే..

పేనుకు పెత్తనం ఇస్తే తల మొత్తం కొరిగిందట.. ఈ సామెత తీరుగానే ఉంది ఆ హెడ్ కోచ్ వ్యవహారం. మహిళా క్రికెటర్లకు మెలకువలు నేర్పించాలని హెడ్ కోచ్ గా నియమిస్తే.. అతడు చేయకూడని పనిచేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2024 / 08:10 AM IST

    Head Coach Duleep Samara Veera

    Follow us on

    Cricket Australia : స్లెడ్జింగ్ చేస్తుంది.. నిబంధనలను పాటించదు.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది.. గెలవడానికి అడ్డదారులు తొక్కుతుంది.. క్రికెట్ ఆస్ట్రేలియా పై ఇలాంటి ఆరోపణలు చాలా. కానీ ఆటగాళ్లకు క్రికెట్ నేర్పడంలో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ తర్వాతే మరెవరైనా. కోచింగ్ విషయంలో ఆస్ట్రేలియా ఏమాత్రం రాజీపడదు. పైగా కోచ్ ల నియామక విషయంలో అనేక రకాలుగా జల్లెడ పడుతుంది. అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాతే ఎంపిక చేస్తుంది. అలా శ్రీలంక జట్టుకు చెందిన సీనియర్ ఆటగాడు దులీప్ సమర వీరను విక్టోరియా మహిళల జట్టు హెడ్ కోచ్ గా మే నెలలో నియమించింది. కోచ్ గా మహిళలకు క్రికెట్ లో మెలకువలు, నైపుణ్యాన్ని నేర్పాల్సిన అతడు.. వాటిని పక్కన పెట్టి ఇతర పనులు చేయడం మొదలుపెట్టాడు.. మహిళా క్రికెటర్ల వద్ద తన వక్రబుద్దిని బయట పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఒక మహిళా క్రికెటర్ ను టార్గెట్ చేశాడు. ఆమెను పదే పదే వంకర దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. మొదట్లో అతడి వ్యవహారాన్ని ఆమె మౌనంగా భరించింది. అతడు చేష్టలు మరింత మితిమీరిపోవడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆస్ట్రేలియా బోర్డు క్రమశిక్షణ కమిటీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దులీప్ పై 20 సంవత్సరాల పాటు నిషేధం విధించింది.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి సంబంధించి బిగ్ బాష్ లీగ్ లో కూడా ఎలాంటి పదవి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ సమయంలో తమకు ఈ విషయాన్ని చెప్పిన ఆ మహిళ క్రికెటర్ ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అభినందించింది.

    ఇదే తొలిసారి

    క్రికెట్ చరిత్రలో హెడ్ కోచ్ ఇలాంటి చర్యలకు గురికావడం ఇదే తొలిసారి. దులీప్ సమర వీర శ్రీలంక జట్టు తరఫున 7 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం అతడి వయసు 52 సంవత్సరాలు. ” అతడి నిర్వాకాన్ని ఓ మహిళా క్రికెటర్ మా దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో వాస్తవాలు తెలుసుకునేందుకు మేము కమిటీని నియమించాం. రహస్యంగా అతనిపై ఓ కన్ను వేశాం. ఆమె చెప్పినట్టుగానే అతడి వ్యవహార శైలి ఉంది. ఆటను నేర్పించే బదులు.. అతడు వక్ర బుద్ధిని అలవరుచుకున్నాడు. దీనివల్ల మహిళా క్రికెటర్లు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బాధిత మహిళ క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామం మంచిది కాదు. ముఖ్యంగా ఆడవాళ్లకు అసలు మంచిది కాదు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మా దేశ క్రికెట్ లో ఉన్న ప్రమాణాలను సూచిస్తుంది. ఆటగాళ్ల విషయంలో మేము పగడ్బందీగా ఉంటాం. కోచ్ విషయంలోనూ స్పష్టతను కలిగి ఉంటాం. అలాంటి క్రికెట్ ఆడుతున్న ఆ దేశ జట్లకు నాణ్యమైన మెలకువలు నేర్పించే హెడ్ కోచ్ లు మాత్రమే కావాలి. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వ్యక్తులు అవసరం లేదు. మేము క్రికెట్ ఆడే విషయంలో.. క్రికెట్ నేర్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు. ఎలాంటి సమయంలోనైనా మా ఆటగాళ్లను కాపాడుకుంటాం. భద్రతకు, రక్షణకు, పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తామని”క్రికెట్ విక్టోరియా చీఫ్ నిక్ కమిన్స్ వెల్లడించారు.