https://oktelugu.com/

Bigg Boss Telugu 8: రౌడీ లాగా ప్రవర్తించిన ప్రేరణ..అసలు ఈమె అమ్మాయేనా? ఈమె నోటికి అదుపు ఉండదా!

కోపం లో ఉన్నప్పుడు ఈమె వదిలే మాటలను చూస్తే ఏందీ ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది?, చాలా తప్పు కదా అని అనిపించక తప్పదు. ఈమె మాత్రం ఎవరి మీదకైనా దూసుకొని పోతుంది, ఈమె మీదకు వస్తే మాత్రం నోరు పారేసుకుంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 08:31 AM IST

    Bigg Boss Telugu 8(24)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన లేడీ కంటెస్టెంట్స్ లో కచ్చితంగా ఈమె టాప్ 5 లో ఉంటుంది, టైటిల్ కొడుతోంది అని ఆడియన్స్ అనుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ. ఈమె ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ గేమ్ షోలోనే తన సత్తా ఏంటో చూపించింది. మగవాళ్ళతో సమానంగా ఈమె ఆ షో లో ఆడిన తీరుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కచ్చితంగా ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని అనుకున్నారు. అందరూ కోరుకున్నట్టే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అంచనాలకు తగ్గట్టు గానే అసలు సిసలు ఆడపులి లాగా రెచ్చిపోయి గేమ్ ని ఆడుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆమె ఆడిన తీరుని చూస్తే సెల్యూట్ చేయక తప్పదు. ఆడపులి లాగా మగవాళ్ళను సైతం లెక్క చేయకుండా తన టీం కోసం పోరాడింది. ఆమె రెండు చేతులకు బాగా దెబ్బలు తగిలాయి. గాట్లు అయ్యి ఎర్రగా ఆమె చేతులు కమిలిపోయాయి. అయినప్పటికీ కూడా లేడీ టైగర్ లాగా పోరాడింది. అంతా బాగానే ఉంది కానీ, ఈమె నోటికి ఆనకట్ట లేకుండా పోయింది.

    కోపం లో ఉన్నప్పుడు ఈమె వదిలే మాటలను చూస్తే ఏందీ ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది?, చాలా తప్పు కదా అని అనిపించక తప్పదు. ఈమె మాత్రం ఎవరి మీదకైనా దూసుకొని పోతుంది, ఈమె మీదకు వస్తే మాత్రం నోరు పారేసుకుంటుంది. నిన్న జరిగిన గుడ్ల టాస్కులో ఈమె నిఖిల్ క్లాన్ వైపు వెళ్తుంది. వాళ్ళ గుడ్లను కాజేసే ప్రయత్నం చేయగా సీత ప్రేరణ ని సోఫా లోకి తోసి గట్టిగా రెండు చేతులతో అదిమిపట్టుకుంటుంది. అప్పుడే విష్ణు ప్రియా కూడా వచ్చి మరో చెయ్యి ప్రేరణ మీద వేస్తుంది. దీంతో ప్రేరణ కోపం ‘చూసావా ఈ రాక్షసి నా మీద ఎలా పడుతుందో’ అని అంటుంది. అప్పుడు విష్ణు ప్రియా ‘ఎవరే రాక్షసి..రాక్షసి దానా..తుతూ’ అని అంటుంది. అప్పుడు ప్రేరణ ‘పోవే..క్యారక్టర్ లేని దానా’ అని ఒక మాట అనేస్తుంది. అప్పుడు విష్ణు ప్రియా నువ్వేనే క్యారక్టర్ లేని దానివి, పెద్ద పతీవ్రత దిగొచ్చింది అని అంటుంది. ఇక్కడ కచ్చితంగా ప్రేరణ దే తప్పు.

    ఎందుకంటే ముందు ఆమెనే మాట వదిలింది. అది చాలా పెద్ద తప్పుడు మాట అనే చెప్పాలి. కేవలం ఒక గేమ్ కోసం క్యారక్టర్ లేని దానా వంటి పదాలు ఉపయోగించడం ఎందుకు?, ఈమె అసలు అమ్మాయేనా అని చాలా మందికి అనిపించింది. అయితే విష్ణు ప్రియా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆమె కూడా చాలా మాటలు వదిలింది. అంతే కాదు ఆమె ప్రవర్తన కూడా చాలా వింతగా ఉంది. ప్రేరణ మీద అసూయ తో రగిలిపోతున్నట్టుగా ఆమె తీరుని చూస్తే అనిపిస్తుంది. మొత్తానికి ప్రేరణ నిన్న జరిగిన టాస్కులో అద్భుతంగా ఆడి ఆడపులి అని అనిపించుకున్నప్పటికీ, ఆ ఒక్క విషయం లో నోరు జారడం వల్ల చాలా నెగటివ్ అయ్యింది.