https://oktelugu.com/

MS Dhoni Brother : ధోనీకి అన్న ఉన్నాడా..? ఇబ్బందుల్లో ఉన్నా మహీ పట్టించుకోవడం లేదా..?

ధోనికి సోదరులు ఉన్నారు. అతడు అన్నయ్య పేరు నరేందర్ సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచీలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ధోనికి అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నాడు.

Written By:
  • BS
  • , Updated On : July 20, 2023 / 09:01 AM IST
    Follow us on

    MS Dhoni Brother : మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు తెలియని వారు ఉండరు. క్రికెట్ ప్రపంచంలో ఒకరకంగా చెప్పాలంటే రారాజుగా వెలుగొందుతున్నాడు ధోని. భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని అనేక అపూర్వ విజయాలను అందించి పెట్టాడు. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ, అనేక సార్లు ఆసియా కప్ ను జట్టుకు అందించి భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అందుకే ధోనీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ధోని గురించి బయట ప్రపంచానికి తెలిసినంతగా ఆయన కుటుంబం గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ధోని, ధోని భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవా ధోని గురించి మాత్రం అభిమానులకు బాగా తెలుసు. కానీ, ధోని తల్లిదండ్రులు, సోదరులు, ఇతర కుటుంబ సభ్యుల గురించి మాత్రం అభిమానులకే కాదు బయట ప్రపంచానికి కూడా పెద్దగా తెలియదు. అయితే, ధోనీకి ఒక సోదరుడు ఉన్నాడని, అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ధోని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక ఫోటో వైరల్ అవుతోంది.
    ప్రపంచ క్రికెట్లో అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న ఆటగాడు ధోని. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం ధోనీకి వివిధ రూపాల్లో సమకూరుతుంది. అటువంటి ధోని ఎంతోమందికి సహాయం చేసిన విషయాలను కూడా చూసాం. కానీ తన సొంత అన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారిని కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి. అసలు ధోనీకి అన్న ఉన్నాడా..? అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ధోనికి సోదరులు ఉన్నారు. అతడు అన్నయ్య పేరు నరేందర్ సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచీలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ధోనికి అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నాడు. కానీ, ఇప్పటివరకు ధోని తన కుటుంబం గురించి ఎక్కడ బయట ప్రపంచానికి తెలియనీయలేదు.
    తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ధోని అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని..
    ధోని అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని ఎప్పటికప్పుడు మహేంద్రసింగ్ ధోనీని కలుస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచిన తర్వాత నరేంద్ర సింగ్.. ధోనిని వెళ్లి కలిశాడు. ఈ విషయాన్ని క్రిక్ టైమ్ వెల్లడించింది. ధోని అన్నయ్య ఫోటోలు చూస్తున్న అభిమానులకు అయితే ఒకింత బాధ కలుగుతుంది. ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపిస్తోంది. కోట్లాది రూపాయలకు అధిపతి అయిన ధోని.. అన్నకు కనీసం సాయం చేయకపోవడం ఏమిటి అంటూ పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధీన స్థితిలో కనిపిస్తున్న ధోని అన్నయ్య నరేంద్ర సింగ్ ధోనీని చూసి.. అయ్యో పాపం అంటూ పలువురు నిట్టూరుస్తున్నారు. అయితే ధోని సాయం చేయడం లేదు అన్న ప్రశ్నలకు నరేంద్ర సింగ్ ధోని.. సమయస్ఫూర్తితో సమాధానం చెబుతుండడం గమనార్హం. మహి బాల్యం, యువకుడిగా ఉన్నప్పుడు కష్టాలు పడ్డ సమయంలో తాను సాయం చేసింది ఏమీ లేదని, ఓనిగా ప్రపంచానికి పరిచయం అవడంలో కూడా నా ప్రమేయం లేదని నరేంద్ర సింగ్ ధోని పేర్కొంటున్నారు. ఇక ధోని గురించి తీసిన సినిమాలో తమ గురించి, కుటుంబం గురించి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు నరేందర్ సింగ్ ధోని. మహి తనకంటే పదేళ్లు చిన్నవాడని, తను బ్యాట్ పట్టుకునేసరికి తాను రాంచి నుంచి వెళ్లిపోయినట్లు నరేంద్ర సింగ్ ధోని తెలిపాడు. కోసం అల్కోరాలోని కుమాన్ యూనివర్సిటీకి వెళ్ళిపోయానని, అయితే ధోనీకి కొన్ని విషయాల్లో నైతికంగా అండగా ఉన్నప్పటికీ, వాటిని సినిమాలో ఇరికించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు నరేంద్ర సింగ్. ఇక రాజకీయాలు పట్ల ఆసక్తిగా ఉన్న నరేంద్ర సింగ్ ధోని 2013లో సమాజ్వాది పార్టీలో చేరాడు. అంతకుముందు బిజెపిలో కూడా ఉన్నాడు. నరేంద్ర సింగ్ ధోనీ కి 2007లో వివాహం జరగగా ఒక కుమారుడు కుమార్తె ఉన్నట్లు జాతీయం మీడియా వెల్లడించింది. ధోని తన అన్నకు సహాయం చేయడం లేదన్న సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి చేసే సహాయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ధోనీకి లేదని, వారి కుటుంబ సభ్యులకు భోగి గురించి తెలుసని స్పష్టం చేస్తున్నారు.