https://oktelugu.com/

Usman Khawaja : ట్రావిస్ హెడ్ కు తిట్లు.. పిల్లల్ని క్రికెట్ కు దూరంగా ఉంచాలనుకున్న ఖవాజా..!

లీడ్స్ టెస్ట్ లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఇంగ్లాండ్ అభిమానులు రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ను ఉద్దేశించి అభిమానులు చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా బాధపడిన ఉస్మాన్ ఖవాజా.. తాజాగా దానిపై స్పందించాడు. హెడ్ ను ఉద్దేశించి అభిమానులు వ్యాఖ్యానించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వాపోయాడు. ఇటువంటి మాటలు విన్న తర్వాత తన పిల్లలను క్రికెట్ ను ఎంచుకోనివ్వబోనని స్పష్టం చేశాడు.

Written By:
  • BS
  • , Updated On : July 20, 2023 / 09:19 AM IST
    Follow us on

    Usman Khawaja : క్రికెట్ అభిమానుల వ్యవహార శైలి ఈ మధ్యకాలంలో వివాదాస్పదం అవుతోంది. తమ జట్ల ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసిన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొన్నిసార్లు అభిమానులు సహనం కోల్పోయి క్రికెటర్ల పై దాడులకు పాల్పడడం అనేక సందర్భాల్లో చూసే ఉంటాం. కొన్నిసార్లు ఆటగాళ్లపై అభిమానులు చేసే కామెంట్లు దారుణంగా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇదే విధమైన అనుభవం ఎదురయింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇంగ్లాండు అభిమానులు దుర్భాసలాడారు. అభిమానుల వ్యవహార శైలి ఆస్ట్రేలియా ఆటగాళ్లు మర్చిపోలేకపోతున్నారు.
    యాషెస్ సిరీస్ లో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండులో పర్యటిస్తోంది. ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ ను ఇరుజట్లు ఆడుతున్నాయి. ఇప్పటికీ ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా  2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో లీడ్స్ వేదికగా జరిగిన టెస్ట్ సందర్భంగా ఇంగ్లాండ్ అభిమానులు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లపై రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కొంతమంది ఆటగాలను ఇంగ్లాండ్ అభిమానులు ఓటమి జీర్ణించుకోలేక దుర్భాషలాడారు. దీనిపై తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

    తన పిల్లలను క్రికెట్ కు దూరంగా ఉంచుతా.. 
    లీడ్స్ టెస్ట్ లో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఇంగ్లాండ్ అభిమానులు రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ ను ఉద్దేశించి అభిమానులు చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా బాధపడిన ఉస్మాన్ ఖవాజా.. తాజాగా దానిపై స్పందించాడు. హెడ్ ను ఉద్దేశించి అభిమానులు వ్యాఖ్యానించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వాపోయాడు. ఇటువంటి మాటలు విన్న తర్వాత తన పిల్లలను క్రికెట్ ను ఎంచుకోనివ్వబోనని స్పష్టం చేశాడు. వ్యక్తిగతంగా తాను క్రికెట్ ఆడుతున్నప్పటికీ, తన పిల్లలను మాత్రం ఇటువైపుగా ప్రోత్సహించని ఖవాజ స్పష్టం చేశాడు. లీడ్స్ టెస్టులో ట్రావెల్స్ హెడ్ ను అసభ్య పదజాలంతో ప్రేక్షకులు తూలనాడారని, అలాంటి పదాలను అందరి ముందు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి ఘటనలు తమకు మాత్రమే జరిగిందని భావించొద్దని, ఇలాంటి అనుభవమే ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు ఎదురవుతుందని, ఎవరికి జరిగినా తాను అటువంటి వాటిని అంగీకరించబోనని ఖవాజ స్పష్టం చేశాడు. ఈ తరహా దుర్భాషలు సరైన విధానం కాదని, ప్రపంచంలోని క్రీడల్లో ఇదే పరిస్థితి ఉందని వాపోయాడు. అభిమానులు ఒక జట్టును తమ సొంతమని భావిస్తే ప్రత్యర్ధులపై విపరీతంగా దుర్భాసలాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశాడు. క్రీడాకారులతో పాటు అభిమానులు కూడా గెలుపోవటములను సమానంగా తీసుకున్నప్పుడే ఆట నుంచి ఈ పరిస్థితిని దూరం చేయవచ్చని ఖవాజా స్పష్టం చేశాడు.