https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మురుగదాస్ కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...సినిమాలా పరంగా చూసిన, వ్యక్తిత్వం పరంగా చూసిన ఆయన చాలా గొప్ప వ్యక్తి...

Written By:
  • Gopi
  • , Updated On : July 28, 2024 / 08:50 AM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మురుగదాస్…సూర్య తో చేసిన ‘గజినీ’ సినిమాతో ఒక్కసారిగా ఆయన తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో కూడా తనదైన రీతిలో ఒక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ గా కూడా ఎదిగాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా ‘స్టాలిన్ ‘ అనే సినిమా చేశాడు. ఇక దాని ఫలితం ఎలా ఉన్నా కూడా డైరెక్టర్ గా ఆయనకు మంచి మార్కులైతే పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ప్రస్తుతానికి ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం ఒక మంచి కథని కూడా రెడీ చేసుకొని రంగం లోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తెలుగులో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ తో మురుగదాస్ ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఇక దానికోసం పవన్ కళ్యాణ్ కి కూడా ఒక కథ వినిపించారట. పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటి అనే విషయం పక్కన పెడితే ఒక సూపర్ హిట్ సినిమాను అయితే పవన్ కళ్యాణ్ కోల్పోయాడనే చెప్పాలి..

    Also Read: ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి సాక్షి శివానంద్.. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది?

    ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే మురుగదాస్ డైరెక్షన్ లో విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి ‘ సినిమా.. ఈ మూవీ ని ఒకేసారి బైలింగ్వల్ గా తెలుగు, తమిళ్ లో మురుగదాస్ చేయాలని అనుకున్నాడట… తమిళంలో విజయ్ ని పెట్టి, తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాను ఏకకాలంలో తీయాలని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అదే సమయంలో ఇక్కడ జనసేన పార్టీ పెట్టడం ఆయన ఆ పార్టీ పనుల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. ఇక అందుకే తమిళంలో మాత్రమే కత్తి సినిమాని చేసి మురుగదాస్ అక్కడ సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

    ఇక ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా కత్తి సినిమాని ‘ఖైదీ నెంబర్ 150’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇందులో ప్రధానంగా రైతు సమస్యల గురించి చర్చించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తే తెలుగులో బాగా కనెక్ట్ అయ్యేది. కానీ అప్పటికి పవన్ కళ్యాణ్ ఉన్న బిజి వల్ల ఈ సినిమాని చేయలేకపోయాడు. ఇక దాంతో మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాని చేసి ఒక సూపర్ సక్సెస్ అందుకోవడం అనేది ఒక మంచి పరిణామం అనే చెప్పాలి…

    ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మురుగదాస్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరొక సినిమా అయితే చేయలేదు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ ను కలపడానికి కొంతమంది ప్రొడ్యూసర్స్ ప్రయత్నం చేసినప్పటికీ అది వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ రానున్న రోజుల్లో వీళ్ళ కాంబో వర్కౌట్ అవుతుందేమో చూడాలి…

    Also Read: రాజమౌళి కల్కి మూవీలో నటించడానికి అసలు కారణం ఇదా… కీలక విషయం వెలుగులోకి!