https://oktelugu.com/

kalki 2829 ad : రాజమౌళి కల్కి మూవీలో నటించడానికి అసలు కారణం ఇదా… కీలక విషయం వెలుగులోకి!

ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పాత్రలన్నిటికీ ప్రాధాన్యత ఉండేలా చూశాం.

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2024 / 07:50 PM IST

    this is how rajamouli involved in prabhas kalki 2829 AD movie

    Follow us on

    kalki 2829 ad : కల్కి మూవీతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ నమోదు చేశారు. ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ లో నాగ్ అశ్విన్ అధికభాగం దక్కుతుంది. కాగా కల్కి మూవీలో ఆర్జీవీ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్స్ చేశారు. రాజమౌళి కల్కి చిత్రంలో గెస్ట్ రోల్ చేయడం వెనుక కారణం ఏమిటో వెల్లడించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1,100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇతిహాసాలను ఆధారంగా కథను రూపొందించి నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి కొత్త అనుభూతి అందించాడు.

    కథను రూపొందించిన విధానం, విజువల్స్, మధ్య మధ్యలో వచ్చే కేమియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో దర్శకుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ అతిథి పాత్రల్లో కనిపించి అదరగొట్టారు. కల్కి మూవీలోల్ బౌంటీ హంటర్ గా జక్కన్న కనిపించారు. చింటూ అనే ఫుడ్ వెండర్ గా రామ్ గోపాల్ వర్మ నటించారు. కాగా రాజమౌళి, భైరవ మధ్య వచ్చే సన్నివేశాలు భలే ఫన్నీగా ఉంటాయి. అయితే రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో నటించడం ఆడియన్స్ కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి.

    అయితే వాళ్ళు ఈ సినిమాలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారు, కల్కి మూవీలో స్టార్ డైరెక్టర్స్ ఎలా భాగమయ్యారు అనే దానిపై నాగ్ అశ్విన్ ఓపెన్ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. మా చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆయా పాత్రల కోసం వాళ్ళిద్దరిని ఒప్పించాల్సి వచ్చింది. మంచి మనసుతో వాళ్ళు ముందుకు వచ్చారు.

    ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పాత్రలన్నిటికీ ప్రాధాన్యత ఉండేలా చూశాం. మహాభారతంలో ఎంతో కీలకమైన అశ్వద్ధామ క్యారెక్టర్ కు అమితాబ్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు. దేశంలోని పెద్ద స్టార్లలో ఆయన ఒకరు. ఆయన మాత్రమే ఈ పాత్రను మరింత శక్తివంతంగా చేయగలరు అనిపించింది. అమితాబ్ – ప్రభాస్ ల మధ్య పోరాట సన్నివేశాలను తీయాలనేది నా కల. వాళ్ళు ఈ సినిమా కి ఒకే చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది. అని నాగ్ అశ్విన్ అన్నారు.

    కేవలం కల్కి సినిమాకు సప్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి నటించారని నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పారు. ఇక కల్కి పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. నాగ్ అశ్విన్ రెండో భాగంలోనే అసలు కథ ఉందని చెప్పారు. కల్కి పార్ట్ 1 తన పాత్రలు, కొత్త ప్రపంచం ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభాస్ తెలిపాడు. ఇప్పటికే కల్కి రెండవ భాగం కొంత మేర పూర్తి చేసుకుంది. మెజారిటీ సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉంది. కల్కి పార్ట్ 2 థియేటర్స్ లోకి రావడానికి సమయం పడుతుందని నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు.