Homeఎంటర్టైన్మెంట్Shakshi  Sivanand. : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి సాక్షి శివానంద్.. మరి ఇప్పుడు ఎక్కడ...

Shakshi  Sivanand. : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి సాక్షి శివానంద్.. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది?

Shakshi  Sivanand. :  సీనియర్ హీరోయిన్ ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో చాలా మంది హీరోయిన్ లు స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించారు. హిట్ లతో దూసుకొని పోయి ఎన్నో అవకాశాలు అందుకున్నారు. కానీ పెళ్లి తర్వాత చాలా మంది ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కొందరు తల్లి, అత్త, సపోర్టింగ్ పాత్రలు, మెయిన్ లీడ్ లు అంటూ ఇంకా ఇండస్ట్రీలోనే కొనసాగుతే కొందరు మాత్రం ఫ్యామిలీ, పిల్లలు అంటూ సినిమాలకు దూరం అయ్యారు. కుటుంబంతో పాటు సినిమా కూడా లైఫ్ అంటూ కొందరు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. అయితే గతంలో తమ అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ లు ఇప్పుడు కూడా నటిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటారు. ఇదిలా ఉంటే స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించిన తారలు అనుకోకుండా వెండితెరకు దూరమయ్యారు.. అందులో సాక్షి శివానంద్ ఒకరు. మరి ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది అనే వివరాలు చూసేద్దాం.

చక్కటి చిరునవ్వు..అందమైన రూపం.. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది సాక్సి శివానంద్. సహజమైన నటనతో ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 1993లోనే అన్నా వదిన సినిమాతో తెలుగులో నటించింది అమ్మడు. ఇందులో కృష్ణంరాజు, జయప్రద హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో సాక్షి శివానంద్ మరో యంగ్ హీరో సరసన నటించింది. తెలుగులో అవకాశాలు వస్తున్న సమయంలోనే హిందీ సినిమాల్లో నటించింది. అక్కడ సక్సెస్ అయిన తర్వాత.. చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చిరు జోడిగా నటించి మెగాస్టార్ అభిమానును సైతం సొంతం చేసుకుంది అమ్మడు.

మాస్టార్ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించింది సాక్షి. ఈ సినిమాలో బ్యూటీ క్యూట్ నెస్ కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది. దీనికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కారణం అంటారు నెటిజన్లు. 90’sలో తన సినిమాలతో దుమ్ము దులిపేసిన ఈ బ్యూటీ.. అప్పట్లో కుర్రకారుకు కలల రాకుమారి. ఈ సినిమా తర్వాత అమ్మడుకు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. చాలా తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ డమ్ ను కూడా సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ.కలెక్టర్ గారు, రాజహంస, నిధి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించింది అమ్మడు.

సీతారామరాజు, పెళ్లి వారమండి, యమ జాతకుడు, వంశోద్ధారకుడు, యువరాజు వంటి సినిమాలు అమ్మడు కెరీర్ ను టర్న్ చేశాయి అని చెప్పడంలో సందేహం లేదు. రాజశేఖర్, సాక్షి కాంబోలో వచ్చిన సింహరాశి సినిమాకు ఇప్పటికీ కూడా అభిమానులు ఉన్నారు. అందులో నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలోని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. తెలుగు, కన్నడ, హిందీ భాషలలోఎన్నో సినిమాలు నటించిన అమ్మడు .. సినిమాలకు దూరం అయింది. సినిమాలకు మాత్రమే కాదు ఏకంగా సోషల్ మీడియాకు కూడా దూరం అయింది అమ్మడు. దీంతో ఈ బ్యూటీకి సంబంధించిన ఎలాంటి ఇన్ ఫర్మేషన్ కూడా తెలియరాలేదు. కానీ సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ మాత్రం సాక్షి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సాక్షి అమెరికాకు చెందిన సాగర్ అనే వ్యక్తిని 2016లో పెళ్లి చేసుకుందని టాక్. అయితే ఆ తర్వాతనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసినట్టు తెలుస్తోంది. మరి మళ్లీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నారు కొందరు. చూడాలి ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో..

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version