https://oktelugu.com/

Ind Vs Sl T20: మ్యాచ్ ను భారత్ వైపు టర్న్ అయ్యేలా చేసింది అతడే.. శ్రీలంక బోల్తా పడింది అక్కడే..

శ్రీలంక బౌలర్లలో మతీషా పతీరణ 4/40 ఆకట్టుకోగా.. దిల్షాన్ మధు శంక, అసిత ఫెర్నాండో, హస రంగ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలి, 43 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 28, 2024 / 08:44 AM IST

    Ind Vs Sl T20

    Follow us on

    Ind Vs Sl T20: కొత్త కోచ్.. కొత్త కెప్టెన్.. వరుసగా రెండు టోర్నీలు గెలిచింది.. ఇన్ని సానుకూల అంశాల మధ్య టీమిండియా శ్రీలంకలో అడుగుపెట్టింది. తొలి అడుగును విజయవంతంగా వేసింది. శ్రీలంక పర్యటనను టీమిండియా విజయంతో మొదలుపెట్టింది. గౌతమ్ గంభీర్ – సూర్య కుమార్ యాదవ్ ద్వయం తమ ప్రయాణాన్ని అద్వితీయమైన విజయంతో షురూ చేసింది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత జట్టు పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ గెలుపు ద్వారా మూడు టి20 సిరీస్ ను భారత్ 1-0 లీడ్ లో నిలిచింది.

    ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ సేన ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 రన్స్ చేసింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (26 బంతుల్లో 58) సూపర్ హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ 33 బంతుల్లో 49, యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 40, గిల్ 15 బంతుల్లో 34 పరుగులు చేసి.. టీమిండియా భారీ స్కోర్ చేసేందుకు కారణమయ్యారు..

    శ్రీలంక బౌలర్లలో మతీషా పతీరణ 4/40 ఆకట్టుకోగా.. దిల్షాన్ మధు శంక, అసిత ఫెర్నాండో, హస రంగ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలి, 43 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సాంక రాకెట్ వేగంతో ఆడాడు. 48 బాల్స్ లో 79 రన్స్ చేశాడు., కుశాల్ మెండిస్ 27 బంతుల్లో 45 రన్స్ చేసి అదరగొట్టాడు. తదుపరి ఆటగాళ్లు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు. రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ నేల కూల్చారు.

    214 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన శ్రీలంకకు భారీ ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక, కుశాల్ మెండీస్ మైదానంలో విధ్వంసాన్ని సృష్టించారు.. ఎదురు దాడికి దిగుతూ.. పరుగులు సాధించారు. ఏకంగా తొలి వికెట్ కు 84 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేశారు. ఈ జోడిని విడగొట్టేందుకు సూర్య కుమార్ యాదవ్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వీరిద్దరి జోరు చూస్తుంటే శ్రీలంక సులభంగా గెలిచేలాగా కనిపించింది.. ఈ దశలో కుశాల్ మెండీస్ ను అర్ష్ దీప్ సింగ్ పెవిలియన్ పంపించాడు. అతడు ఔట్ కావడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది.

    కుశాల్ మెండీస్ ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి కుశాల్ ఫెరీరా వచ్చాడు. అతనితో కలిసి నిస్సాంక ధాటిగా ఆడాడు. ఈ దశలో 34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత నిస్సాంక మరింత దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. సెంచరీ వైపుగా సాగాడు. అయితే అత్యంత ప్రమాదకరంగా మారిన అతడిని అక్షర్ పటేల్ పెవిలియన్ పంపించాడు. ఇదే ఓవర్ లోనే కుశాల్ ను వెనక్కి పంపించి ఒక్కసారిగా మ్యాచ్ భారత వైపు టర్న్ అయ్యేలా చేశాడు.. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి అసలంక (0), షనక(0) సిరాజ్ అద్భుతమైన త్రోకు రన్ ఔట్ అయ్యాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు సున్నా చుట్టేయడంతో శ్రీలంక కోలుకోలేని కష్టాల్లో పడింది. కీలకమైన సమయంలో ఒత్తిడిని జయించడంలో లంక జట్టు విఫలమైంది. ఇదే దశలో రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. కీలకమైన మూడు వికెట్లను పడగొట్టడంతో లంక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివర్లో వచ్చిన కామిందు మెండిస్ ను రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక ఓటమి ఖరారైంది.