Pawan Kalyan And Ram Charan: మెగా ఫ్యామిలీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోలు ఇండస్ట్రీకి సేవలను అందిస్తూ తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్క హీరో కూడా తమదైన రీతిలో సినిమాలను చేస్తూ ఇప్పుడు సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కూడా తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఒక రకంగా వాళ్ళ సినిమాలు జనాలను ఎంటర్ టైన్ చేస్తూనే ఒక మంచి మెసేజ్ ను కూడా ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలైతే చాలా వరకు ప్రేక్షకులను అలరించడమే కాకుండా అందులో ఇన్నర్ గా ఏదో ఒక మెసేజ్ అయితే దాగి ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ చిరంజీవి దగ్గర కంటే పవన్ కళ్యాణ్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవారట. ఎందుకంటే చిరంజీవి షూటింగ్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఉండేవాడు. కాబట్టి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తోనే ఆడుకుంటూ తనతో అన్ని విషయాలు పంచుకుంటు ఉండేవాడు. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడింది… ఇక ఇప్పటికి కూడా ఆ బాండింగ్ అనేది అలాగే కొనసాగుతుంది. రామ్ చరణ్ ఏదైనా మైల్ స్టోన్ సాధిస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ వచ్చి ఆ సినిమాని రామ్ చరణ్ ను ఎంకరేజ్ చేస్తూ తను ఇంకా ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఎలా ఎంకరేజ్ చేశాడో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ను కూడా అలాగే ఎంకరేజ్ చేస్తున్నాడనే చెప్పాలి…
Also Read: రాజమౌళి కల్కి మూవీలో నటించడానికి అసలు కారణం ఇదా… కీలక విషయం వెలుగులోకి!
నిజానికి పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ అంటే ఇష్టం ఏర్పడడానికి చాలా సంఘటనలు ఉన్నప్పటికీ ఒక సంఘటన మాత్రం పవన్ కళ్యాణ్ కి ఇప్పటికీ కూడా గుర్తుండిపోతుందట.. చిన్నతనంలో రామ్ చరణ్ కాలేజీకి వెళ్లి వస్తున్న క్రమంలో ఎవరో ఒక అనాధ పిల్లలకి హెల్త్ పరంగా ఇబ్బంది ఉందని తెలిసి తన దగ్గర ఉన్న డబ్బులను స్వయంగా రామ్ చరణ్ వాళ్లకి ఇచ్చాడట. ఇక ఇదంతా చూసిన పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వ్యక్తితం పట్ల గాని ఆయన విధి విధానాల పట్ల గాని మంత్ర ముగ్ధుడు అయ్యాడట. ఇక అప్పుడు రామ్ చరణ్ కి ఆపదలో ఉన్న వారికి ఎప్పుడు సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చారట.
ఇక అందువల్లే రామ్ చరణ్ కూడా ఇప్పటికీ తన శాయ శక్తుల అవతలి వారి కష్టాన్ని చూసి ఎంతో కొంత సహాయం అయితే చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మంచి ప్రవర్తన అనేది చిరంజీవిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రామ్ చరణ్ కి రావడం అనేది నిజంగా ఒక గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి…ఇక మెగా అభిమానులు కూడా వీళ్ళను ఎక్కువగా ప్రేమించడానికి వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కూడా ఒక కారణం అని చాలామంది వివిధ సందర్భాల్లో చెబుతూ ఉంటారు…
నిజంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలు రీల్ హీరోలే కాకుండా, రియల్ హీరోలని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… ఇక మొత్తానికైతే సినిమాలనే కాకుండా ఎవరైనా ఆపద ఉందని తమ దగ్గరికి వస్తే మాత్రం వాళ్లకు తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ రకం గా ఇండస్ట్రీలో వీళ్ళకి ఒక సపరేటు గుర్తింపు అయితే ఉంది…
Also Read: ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి సాక్షి శివానంద్.. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది