Anushka Sharma: న్యూజిలాండ్ తో ఇండియా సెమీస్ మ్యాచ్ లో అనుష్క వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

కోహ్లీ అటు బ్యాట్ తో అందరినీ ఆకర్షిస్తే స్టేడియంలో కూర్చున్న అనుష్క శర్మ మాత్రం తన ఎంకరేజ్ మెంట్ తో కోహ్లీ ని ఉత్సాహపరుస్తూనే, అభిమానులను కూడా అలరించింది.ఇక ఇప్పుడు ఆమె కి సంబంధించిన ఒక విషయం నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది.

Written By: Gopi, Updated On : November 18, 2023 11:08 am

Anushka Sharma

Follow us on

Anushka Sharma: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీమ్ వరుస విజయాలను అందుకుంటూ ఫైనల్ కి దూసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే… ఇక ఇప్పుడు ఫైనల్లో గెలిచి కప్పు కొట్టాలనే ఉద్దేశంతోనే రోహిత్ సేన ఉంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి న్యూజిలాండ్ టీమ్ మీద తలబడి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ తన 50 వ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు, ఇక గ్రౌండ్ లో కోహ్లీ అటు బ్యాట్ తో అందరినీ ఆకర్షిస్తే స్టేడియంలో కూర్చున్న అనుష్క శర్మ మాత్రం తన ఎంకరేజ్ మెంట్ తో కోహ్లీ ని ఉత్సాహపరుస్తూనే, అభిమానులను కూడా అలరించింది.ఇక ఇప్పుడు ఆమె కి సంబంధించిన ఒక విషయం నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఆరోజు ఆమె వేసుకున్న డ్రెస్ అందరిని ఆకర్షించింది.ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా దాని గురించే చర్చ మొదలైంది…అనుష్క నియాన్, బ్లాక్ & వైట్ కాంబినేషన్ డ్రెస్‌లో అందం గా ఉంటూనే ప్రేక్షకులను మత్ర ముగ్ధుల్ని చేసింది…ఇక అనుష్క సినిమాలకి చాలా రోజుల నుంచి దూరం గా ఉంటున్నప్పటికీ ఆమె డ్రెస్సింగ్ మాత్రం మోడ్రన్ కి తగ్గట్టు గా వేస్తూ ఇప్పటికీ కూడా టాప్ హీరోయిన్లకి పోటీ ఇచ్చే విధం గా ముందుకు సాగుతుంది…

ఇక ఇప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ ఓవర్ సైజ్ చొక్కా కావడంతో ప్రేక్షకుల్లోనే కాదు కెమెరా లో కూడా హైలెట్ గా నిలిచింది…ఇక అనుష్క ధరించిన దుస్తులు ధర తెలిస్తే అందరూ షాక్ అవుతారు ఆమె ధరించిన చొక్కా ధర అక్షరాల 19,500 రూపాయలు కావడం అలాగే బాటమ్‌వేర్‌కు సరిపోయే డ్రెస్ ధర 27,500 రూపాయలు కావడం తో అందరూ ఒక్కసారి గా స్టన్ అయ్యారు. ఇక ఈమె భారీ సైజ్ లో ఉన్న డ్రెస్ వేసుకోవడం వెనక అసలు రహస్యం ఏంటి అంటే కోహ్లీ అనుష్క జంట రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్టు గా తెలుస్తుంది…

ఇక అనుష్క విరాట్ ఇద్దరు కూడా ప్రపంచం లోనే అత్యంత క్యూటెస్ట్ కపుల్ గా చెప్పుకోవచ్చు. నిజానికి వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా అన్యోన్యంగా ఉంటూ చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఆదర్శం గా నిలుస్తున్నారు… ఇక అనుష్క పాప పుట్టిన తర్వాత ఆమె ని చూసుకుంటూ ఉంటుంది .ఇక ఆ క్రమ లోనే ఆమె సినిమాలకి కూడా బ్రేక్ ఇచ్చింది…