Rohit Sharma: ఒక స్పిన్నర్ హిట్ మ్యాన్ గా ఎలా మారాడు.. స్ఫూర్తినిచ్చే రోహిత్ శర్మ ప్రయాణమిదీ…

వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అటు ప్లేయర్ గా ఇటు కెప్టెన్ గా సమపాలల్లో న్యాయం చేస్తూ ఇండియన్ టీం కి మంచి విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ శర్మ తన ఎంటైర్ కెరియర్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఇండియన్ టీం ని ఫైనల్ కి తీసుకొచ్చాడు.

Written By: Gopi, Updated On : November 18, 2023 11:05 am

Rohit Sharma

Follow us on

Rohit Sharma: తన క్రికెట్ నైపుణ్యాన్ని కనబరుస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి ఫేవరెట్ ప్లేయర్ గా మారిన రోహిత్ శర్మ ప్రస్తుతం ఇండియన్ టీం సక్సెస్ ఫుల్ కెప్టెన్ లో ఒకడిగా తను కూడా ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి ఆయన సరైన ఫామ్ ని కనబరచలేక ఇబ్బంది పడుతూ వస్తున్నాడు.

కానీ ఎప్పుడైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అటు ప్లేయర్ గా ఇటు కెప్టెన్ గా సమపాలల్లో న్యాయం చేస్తూ ఇండియన్ టీం కి మంచి విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ శర్మ తన ఎంటైర్ కెరియర్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ఇండియన్ టీం ని ఫైనల్ కి తీసుకొచ్చాడు. ఆయన పేరు మీద ఉన్న హిట్ మాన్ అనే పేరుని సహకారం చేసుకుంటూ ప్రతి మ్యాచ్ లో అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడుతూ ధనాధన్ బ్యాటింగ్ తో ప్రేక్షకులందరిని ఆనందపరుస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇండియన్ టీం ని వరల్డ్ కప్ ఫైనల్ లో గెలిపించడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు…

ఇక ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ కు ఆయన అందించిన సేవలను గుర్తించి ఈయనకి సంబంధించిన స్టోరీని పిల్లల పాఠ్యపుస్తకాలలో చేర్చారు. ప్రతిభావంతులైడైన యువ బ్యాటర్ అని అప్పర్ ప్రైమరీ స్కూల్ పుస్తకంలో రోహిత్ శర్మ పైన ఒక అధ్యాయం ఉన్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ పాఠ్యపుస్తకంలో ముఖ్యంగా కొన్ని విషయాలను పొందుపరిచారు అవి ఏంటంటే స్పిన్నర్ గా మారదామనుకున్న రోహిత్ శర్మ హిట్ మాన్ గా ఎలా మారాడు అంటూ తన కెరీర్ కు సంబంధించిన విషయాలను తెలుపుతూనే ఆయన సాధించిన కొన్ని రికార్డులను కూడా అందులో పొందుపరిచారు…

ఇక రోహిత్ శర్మ 30 ఏప్రిల్, 1987న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని బన్సోడ్‌లో జన్మించాడు. అయితే మొదట రోహిత్ బ్యాట్స్ మెన్స్ అవ్వాలి అని అనుకోలేదు. ఆయనకి బాల్ తో మ్యాజిక్ చేస్తూ బ్యాట్స్ మెన్స్ ని ఇబ్బంది పెట్టే స్పిన్నర్లు అంటే ఇష్టం ఉండటం తో ఆయన కూడా ఒక స్పిన్ బౌలర్ అవుదామని ఒక ఆఫ్ స్పిన్నర్‌గా తన క్రికెట్ కెరీర్‌ను మొదలు పెట్టాడు. కానీ అతని చిన్ననాటి కోచ్ అయిన దినేష్ లాడ్ మాత్రం రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూసి ఈయన బౌలర్ కంటే కూడా బ్యాట్స్ మెన్ గా అయితే బాగా ఆడగలుగుతాడు అంటూ తన లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించి అతనిని బ్యాట్స్‌మెన్‌గా మార్చాడు. రోహిత్ ఒక షాట్ ను ఎలా ఆడాలి ఒక బాల్ ని ఎలా డిఫెన్స్ చేయాలి అనే దానిమీదే ఎక్కువ ఫోకస్ చేసి ఆడేవాడు అది గమనించిన కోచ్ రోహిత్ ని హిట్ మ్యాన్ గా మార్చాడు…

రోహిత్ శర్మ చిన్నతనం లో పడిన ఇబ్బందులు తన చదువు కి కూడా డబ్బులు లేకపోతే వాళ్ల పేరెంట్స్ ఫీజ్ కట్టలేని పరిస్థితి లో ఉన్నప్పుడు తనకి క్రికెట్ ఆడటం వల్ల వచ్చే స్కాలర్ షిప్ మీదనే తన చదువు కొనసాగించాడు లాంటి విషయాలను ఆ పుస్తకం లో పొందు పర్చడం వల్ల పిల్లలకి అది ఒక ఒక మోటివ్ క్లాస్ గా పని చేస్తుంది అనే ఉద్దేశ్యం తోనే అలా చేర్చినట్లు గా తెలుస్తుంది…

అయాన్ సాధించిన రికార్డ్ ల పరంగా చూసుకుంటే…
ఆయన టెస్టుల్లో వెస్టిండీస్ మీద ఆడిన మొదటి టెస్ట్ లోనే సాధించిన సెంచరీ గురించి అలాగే ఆయన వన్డేల్లో శ్రీలంక మీద 264 పరుగులు సాధించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయాలను ఇందులో పొందు పర్చడం విశేషం…ఇక ఈయన స్టోరీ ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…