Sonali Bendre: మన చిన్నతనం లో ఎంతగానో ఇష్టపడిన హీరోయిన్స్ లో ఒకరు సోనాలి బ్రిందే. చిరంజీవి తో ఇంద్ర , శంకర్ దాదా MBBS , బాలకృష్ణ తో పల్నాటి బ్రహ్మనాయుడు, అక్కినేని నాగార్జున తో మన్మధుడు , సూపర్ స్టార్ మహేష్ బాబు తో మురారి, కృష్ణ వంశీ ఖడ్గం , ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మన తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. వాస్తవానికి బాలీవుడ్ లో సోనాలి బ్రిందే పెద్ద హీరోయిన్. సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇలా ఎంతో మంది బాలీవుడ్ సూపర్ స్టార్స్ తో కలిసి ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యూత్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది. అలాంటి సోనాలి బ్రిందే పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది.
ఆమె చివరిసారిగా హీరోయిన్ గా వెండితెర పై కనిపించిన చిత్రం ‘వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దొబారా’. 2013 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె వెండితెర కి దూరమైంది. వ్యక్తిగతంగా క్యాన్సర్ వ్యాధిని ఎదురుకొని , దాంతో పోరాడి జయించిన ఈమె , 2025 వ సంవత్సరం లో ‘బీ హ్యాపీ’ అనే చిత్రంలో గెస్ట్ రోల్ ద్వారా మరోసారి ఆడియన్స్ ని పలకరించింది. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బాలీవుడ్ , టాలీవుడ్ లపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆమె మాట్లాడుతూ ‘హిందీ కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. అక్కడ స్క్రిప్ట్స్ విషయం లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉంటేనే షూటింగ్ కి వెళ్తారు. హిందీ లో అలా కాదు , షూటింగ్ సెట్స్ లోనే సీన్స్ రాస్తుంటారు. దీని వల్ల క్వాలిటీ ఔట్పుట్ రాదు. అంతే కాదు బాలీవుడ్ లో అందించే ఫుడ్ కంటే , టాలీవుడ్ లో అందించే ఫుడ్ చాలా బాగుంటుంది. తెలుగు సినిమాల బడ్జెట్ లు కూడా భారీగా ఉంటుంది. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది సోనాలి బ్రిందే. మన టాలీవుడ్ సినిమాల ద్వారా క్రేజ్ ని సంపాదించుకొని , ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి మన ఇండస్ట్రీ ని తక్కువ చేసి మాట్లాడే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో , బాలీవుడ్ కి చెందిన ఒక హీరోయిన్ మన ఇండస్ట్రీ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం గమనార్హం.
