India Vs Pakistan: ఈనెల 14 వ తేదీన అహ్మదాబాద్ వేదిక ఇండియా పాకిస్థాన్ టీం ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా చాలా కీలకమైన ప్రదర్శన ని కనబర్చడానికి చాలా ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నాయి. నిజానికి ఈ మ్యాచ్ కి ముందు జరిగిన మ్యాచ్ కానీ, తర్వాత జరిగే మ్యాచులు కానీ అన్ని కూడా ఈ మ్యాచ్ ముందు దిగదుడుపే ఎందుకంటే చిరకాల ప్రత్యర్థులు అయిన ఇండియా పాకిస్థాన్ జట్ల మధ్య ఎప్పుడైనా ఒక అద్భుతమైన పోటీ ఉంటుంది.ఇక 1992 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్ టీం వరల్డ్ కప్ లో మన టీం మీద గెలవలేదు.దాంతో ఈసారి గెలిచి వాళ్ళ ఆధిపత్యం చూపించాలని చూస్తుంది.
ఇక దానికి తగ్గట్టు గానే పాకిస్థాన్ ఇప్పటికే చాలా కసరత్తులు చేస్తుంది.ఇక ఈనెల 14 వ తేదీన జరిగే ఈ మ్యాచ్ కోసం మొత్తం ప్రపంచ దేశాల క్రికెట్ అభిమానులందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడడానికి అంత ఆసక్తి గా ఉన్నారు. ఇక ఇప్పటికే ఇండియా వరల్డ్ కప్ లో వరుసగా రెండు విజయాలను నమోదు చేసుకుంది.ఇక పాకిస్థాన్ టీం కూడా ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి రెండు టీం లు కూడా నాలుగు పాయింట్స్ తో ఉన్నాయి. అయితే ఇండియన్ టీం కి రన్ రేట్ ప్లస్ వన్ ఉండటం తో ఇండియన్ టీం రెండొవ స్థానం లో ఉంది.పాకిస్థాన్ మూడోవ స్థానం లో ఉంది నిజానికి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది.
ఇక ఈమ్యాచ్ లో కూడా మన ఇండియన్ ప్లేయర్లు భారీ సెంచరీలు చేసే అవకాశం అయితే ఉంది.ఇక ఈ ఇయర్ వరల్డ్ కప్ లో చాలా సెంచరీలు నమోదు అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో ముగ్గురు సెంచరీలు చేసి వాళ్ళ సత్తా ఏంటో చాటుకున్నారు.ఇక శ్రీలంక పాకిస్థాన్ మ్యాచ్ లో పాకిస్థాన్ టీం లో ఇద్దరు సెంచరీ లు చేయగా, శ్రీలంక టీం నుంచి ఇద్దరు సెంచరీలు చేసారు.ఇక నిన్న జరిగిన ఇండియా ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ లో ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సెంచరీ చేసి ఇండియన్ టీం కి ఒక మంచి విజయాన్ని అందించాడు.
ఇక ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే బెట్టింగ్ రాజు లకి పండగే ప్రపంచం మొత్తం మీద ఈ మ్యాచ్ మీద కొన్ని కోట్లల్లో బెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కోట్ల డబ్బు చేతులు మారుతూ ఉంటుంది.కాబట్టి ఈ ఒక్క మ్యాచ్ అంత స్పెషల్ అనే చెప్పాలి.ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ప్లేయర్లకి వాళ్ళ దేశాల గవర్నమెంట్ లు కూడా చాలా వరకు డబ్బులను గిఫ్ట్ ల రూపం లో ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక దానికి తోడు గా ఈ మ్యాచ్ విజయం అనేది రెండు టీములకి కూడా చాలా కీలకంగా మారనుంది.ఇంతకు ముందే ఏషియన్ కప్ లో ఇండియా టీమ్ పాకిస్థాన్ టీం ని చాలా దారుణంగా ఓడించింది…ఇక ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిదీ అనేది తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాలి…