Dinesh Karthik: చెన్నై జట్టుతో తలపడేందుకు బెంగళూరు రెండు రోజుల క్రితమే చిదంబరం స్టేడియం కి వచ్చింది.. చిదంబరం స్టేడియంలో రెండు రోజులుగా విపరీతమైన ప్రాక్టీస్ చేస్తోంది. ముంబై, చెన్నై జట్లు ఐపీఎల్లో భాగంగా తొలి మ్యాచ్ ఇక్కడ ఆడాయి. ఈ మ్యాచ్లో లో స్కోర్ నమోదయింది. దానిని చేదించే క్రమంలో చెన్నై జట్టు కూడా తడబడింది. చివరికి విజయాన్ని అందుకుంది. ప్లాట్ మైదానం కాకుండా, స్పిన్ బౌలింగ్ కు ఇది సహకరిస్తుంది. అందువల్లే స్పిన్ బౌలర్లు పండగ చేసుకుంటారు. క్రికెట్లో వేటను అత్యంత సులువుగా చేపడుతుంటారు. ఇక ఈ మ్యాచ్లో ఫేవరెట్ గా చెన్నై జట్టు కనిపిస్తున్నప్పటికీ.. బెంగళూరు తొలి మ్యాచ్లో కోల్ కతా ను మట్టి కరిపించిన నేపథ్యంలో రజత్ పాటిదర్ సేన పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో రెండు జట్లు సమానంగానే కనిపిస్తున్నాయి. సొంత మైదానం కావడంతో చెన్నై జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది.
విందు, మందు
చెన్నై జట్టుతో తలపడేందుకు బెంగళూరు ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో.. బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న దినేష్ కార్తీక్ (Dinesh Karthik) .. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు జీవితంలో మర్చిపోలేని విందు ఇచ్చాడు. తన స్వగృహానికి ప్లేయర్లను పిలిపించుకొని వారికి నచ్చిన వంటకాలను దగ్గరుండి వడ్డించాడు. కొంతమంది ఆటగాళ్లు మద్యం తాగారు. దానికి సంబంధించిన వీడియోలను బెంగళూరు అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తున్నారు.. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, పీతలు వంటి వంటకాలు తయారు చేసి ఆటగాళ్లకు దినేష్ కార్తీక్ కొసరి కొసరి వడ్డించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ సందడి చేశారు. మద్యం తాగుతూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించారు.. దినేష్ కార్తీక్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా ఆహారం తయారు చేయించి వడ్డించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కొంతకాలంగా మాంసాహారం తినడం లేదు. కేవలం తృణధాన్యాలను మాత్రమే అతడు ఆహారంగా తీసుకుంటున్నాడు. అందువల్లే దినేష్ కార్తీక్ ప్రత్యేకంగా వంటకాలు తయారు చేయించి అతడికి వడ్డించినట్టు తెలుస్తోంది. ఇక దినేష్ కార్తీక్ విలాసవంతమైన భవంతిలో బెంగళూరు ఆటగాళ్లు ఎంజాయ్ చేసిన అనంతరం.. చెన్నైలోని చిదంబరం మైదానానికి ప్రాక్టీస్ కు వెళ్లారు. కాగా, మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆర్టీసీ, చెన్నై మెట్రో ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నాయి. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లోను అభిమానుల కోసం ఇదే విధంగా సర్వీసులు నడిపించాయి. అర్ధరాత్రి వరకు సర్వీస్లు నడిపించడంతో అభిమానులు ఇబ్బంది పడకుండా తమ గమ స్థానాలను చేరుకున్నారు.
View this post on Instagram