Game changer : రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి , వాటిలో ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) ఒకటి. ఈ సినిమా వాళ్ళ మనసులకు చేసిన గాయాలు సాధారణమైనవి కావు. సుమారుగా మూడేళ్ళ సమయం రామ్ చరణ్ ఈ చిత్రం కోసం కేటాయించాడు. అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లాడు డైరెక్టర్ శంకర్. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం తప్ప, సినిమా మొత్తం ఆడియన్స్ కి కళ్ళు తిరిగేలా చేస్తుంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ ఉండదు, అసలు ఏ సినిమా చూస్తున్నాం రా బాబు అన్నట్టుగా అనిపించింది. ఇక క్లైమాక్స్ అయితే శంకర్ ఆలోచనలకూ దండం పెట్టొచ్చు, అంత దరిద్రంగా ఉన్నింది. అందుకే మొదటి రోజే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న ఈ సినిమా క్లోజింగ్ లో 200 కోట్లు రాబట్టే స్థాయికి పడిపోయింది.
Also Read : ‘గేమ్ చేంజర్’ టాప్..’సంక్రాంతికి వస్తున్నాం’ అవుట్..ఓటీటీలో విచిత్రమైన ఫలితాలు!
థియేటర్స్ లో అలాంటి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ముందుగా తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ వెర్షన్స్ ని విడుదల చేసారు. ఇక్కడ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ హిందీ వెర్షన్ ని జీ 5 లో విడుదల చేసారు, ఇక్కడ మాత్రం రెస్పాన్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో వచ్చింది. జీ5 సంస్థ చెప్తున్న గణాంకాల ప్రకారం ఈ సినిమాకు ఇప్పటి వరకు 250 మిల్లియన్లకు పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. నాన్ స్టాప్ టాప్ 10 లో ఇండియా వైడ్ ట్రెండ్ అవుతూనే ఉంది. దీనిని బట్టి రామ్ చరణ్ కి నార్త్ ఇండియా లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. మొదటి నుండి రామ్ చరణ్ కి నార్త్ ఇండియా లో మంచి ఫేమ్ ఉంది, #RRR తో ఆ ఫేమ్ పదింతలు అయ్యింది.
అందుకే సినిమా బాగాలేకపోయినప్పటికీ ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు అక్కడి ఆడియన్స్. థియేటర్స్ లో కూడా ఈ చిత్రానికి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు ఫుల్ రన్ లో దాదాపుగా 40 కోట్ల రూపాయిల రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కి సరైన బ్లాక్ బస్టర్ తగిలితే హిందీ లో కూడా అద్భుతమైన వసూళ్లు వస్తాయని, పాన్ ఇండియా రేంజ్ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొట్టే సత్తా రామ్ చరణ్ కి ఉందని అంటున్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ఆ రేంజ్ కి చేరుకుంటుందని అంటున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిం
Also Read : గేమ్ చేంజర్ ప్లాప్ కి అసలు కారణం ఏంటో చెప్పిన తమన్…