Digvesh Rathi
Digvesh Rathi : ఐపీఎల్ లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ (LSG vs PBKS) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ రాటి(Digvesh Rathi) చేసిన అతి ప్రవర్తన ఎప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. పంజాబ్ జట్టు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య ను అవుట్ చేసిన తర్వాత కెన్రిక్ విలియమ్స్ మాదిరిగానే “సంతకం” సంబరాలు జరుపుకున్నాడు. అవుట్ ఆయన తర్వాత పెవిలియన్ వెళ్తున్న ఆర్య దగ్గరికి దిగ్వేష్ పరుగున వెళ్లాడు. ” చూశావా.. నీ వికెట్ నా అకౌంట్ లో వేసుకున్నా.. అదీ నా సత్తా” అనే అర్థం వచ్చే విధంగా చేతి మీద సంతకం చేసి చూపించాడు.. అయితే ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా దుమ్ము రేపడంతో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విజయం సాధించిన అనంతరం ఆ జట్టు అభిమానులు దిగ్వేష్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అతడు ఏ సంతకంతో అయితే ఆర్యను టీజ్ చేశాడో.. అదేతీరుగా వారు కూడా స్పందించారు… అయితే దిగ్వేష్ అలా చేయడం పట్ల ఫీల్డ్ ఎంపైర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇలాంటి తీరు సరికాదని మండిపడ్డారు. అయితే దిగ్వేష్ పై ఐపీఎల్ అడ్వైజర్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది..కోడ్ ఆఫ్ కండక్టు ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో 25% వరకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది. అయితే దిగ్వేశ్, ప్రియాంష్ గతంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఒకే జట్టులో ఆడటం విశేషం. వారిద్దరి మధ్య అంతగా బేధాభిప్రాయాలు కూడా లేదు. అలాంటప్పుడు దిగ్వేష్ ఎందుకు అలా ప్రవర్తించాడనేది ప్రశ్నార్ధకంగా మారింది.
Also Read : దీన్నే గెలికి తన్నించుకోవడం అంటారు..పాపం LSG బౌలర్
సునీల్ గవాస్కర్ ఏమన్నాడు అంటే..
దిగ్వేష్ వ్యవహార శైలిపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కూడా మండిపడ్డాడు.” గతంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇలానే ప్రవర్తించాడు. కాకపోతే విరాట్ అలా చేయడం వెనుక బలమైన కారణం ఉంది. కానీ దిగ్వేష్ అలా ప్రవర్తించడం వెనుక ఎటువంటి కారణం లేదు. ఎందుకంటే అప్పటికే దిగ్వేష్ వేసిన 5 బంతులు డాట్ అయ్యాయి. చివరి బంతికి వికెట్ తీశాడు. అలాంటప్పుడు ఈ స్థాయిలో సంబరాలు చేసుకోవడం లో ఏమాత్రం అర్థం లేదు. విరాట్ కోహ్లీ గతంలో ఇలానే చేశాడు. ఆ సిరీస్లో విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు కెన్రిక్ విలియమ్స్ ఇదేవిధంగా ప్రవర్తించాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్లో విలియమ్స్ బౌలింగ్లో విరాట్ వరుసగా ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత “సంతకం” తరహాలోని హావాభావాలు వ్యక్తం చేశాడు. ఒక ఆటగాడు భారీగా పరుగులు చేసినప్పుడు.. ఒక బౌలర్ వికెట్లు తీసినప్పుడు ఇలాంటి హావాభావాలను ప్రదర్శించవచ్చు. అందులో తప్పులేదు. కానీ దిగ్వేష్ ఇలా ప్రవర్తించడం వెనుక బలమైన కారణం లేదు. అందువల్లే ఆటగాళ్లు అదుపులో ఉండాలి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కెరియర్ ప్రమాదంలో పడొచ్చని” సునీల్ గవాస్కర్ తన కామెంట్రీ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దిగ్వేష్ ప్రవర్తన తీరును లక్నో జట్టు యాజమాన్యం కూడా తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. మరి అతడి పై తదుపరి మ్యాచ్లో చర్యలు ఉంటాయా? మాటలతోనే లక్నో మేనేజ్మెంట్ సరిపుచ్చుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే కొంత సమయం పట్టవచ్చు.
Also Read : బలాబలాలు, గెలిచేది ఏ జట్టంటే..
Ekana mein pehli wicket – Check ✅pic.twitter.com/nrAf1pWf7W
— Lucknow Super Giants (@LucknowIPL) April 1, 2025