Digvesh Rathi Fines : ఆ సినిమా సంగతి అలా ఉంచితే…. ఆ డైలాగు ఐపీఎల్లో ఈ ప్లేయర్ కు నూటికి నూరుపాళ్ళు సరిపోయే విధంగా ఉంది. దాదాపు 6 అడుగుల పొడవు ఉంటాడు. జుట్టుతో అందంగా కనిపిస్తాడు. బంతిని గొప్పగా మెలి తిప్పుతుంటాడు..స్పిన్ కు సహకరించని పిచ్ పై కూడా అద్భుతాలు చేస్తుంటాడు. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. మిగతా బౌలర్లు విఫలమైనచోట.. అతడు మాత్రం గట్టిగా నిలబడతాడు. అయితే ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ.. అతని ఓవరాక్షన్ పూర్తిగా డామినేట్ చేస్తోంది. అద్భుతమైన బౌలింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ అతడిని అనామక ఆటగాడిగా మార్చేస్తోంది.
Also Read : ఐపీఎల్ చరిత్రలో 9 మంది ప్లేయర్లు..ఇదే తొలిసారి!
ఐపీఎల్ లో ఆటగాళ్లు దూకుడు కొనసాగించాలి. ప్రత్యర్థి బ్యాటర్లను లేదా బౌలర్లను సరదాగా ఆట పట్టించాలి. అది పరిధి దాటనంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి గీత దాటితే ఇబ్బంది కలుగుతుంది.. అలాంటి గీతను లక్నో జట్టు బౌలర్ దిగ్వేష్ రాటి అనేక సందర్భాల్లో దాటాడు. ఓవరాక్షన్ స్టార్ గా పేరు పొందాడు. తన బౌలింగ్లో బ్యాటర్ అవుట్ అయితే చాలు సిగ్నేచర్ స్టైల్లో స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు. మొదట్లో ఇది కొత్తగా అనిపించినప్పటికీ.. ఆ తర్వాత రాను రాను చిరాకు కలిగించింది. చివరికి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. అభిషేక్ శర్మ అవుట్ కాగానే గెలికి మరీ దిగ్వేష్ అతనితో గొడవ పెట్టుకున్నాడు. అభిషేక్ శర్మ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా దూసుకు వచ్చాడు. అయితే దిగ్వేష్ ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ.. అతని మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ విధించింది. మొత్తంగా చూస్తే అతడు దాదాపుగా 9.37 లక్షలను కోల్పోయాడు..
వాస్తవానికి దిగ్వేష్ ను లక్నో జట్టు యాజమాన్యం మెగా వేలంలో 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటికే ఫైన్ రూపంలో అతడు 9.37 లక్షలను కోల్పోయాడు. అటు ఇటుగా 20.63 లక్షలను అతడు ఫీజుగా స్వీకరించ గలిగాడు. అయితే ఇందులోను ఆదాయపు పన్నులు ఉంటాయి కాబట్టి.. అతడికి 20 లక్షల లోపే మ్యాచ్ ఫీజు లభిస్తుంది.. అద్భుతమైన ఆట తీరు ఉన్నప్పటికీ.. ఓవరాక్షన్ వల్ల విలువను కోల్పోయాడు దిగ్వేష్. అందుకే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలంటారు పెద్దలు. పాపం ఈ విషయం దిగ్వేష్ కు తెలియదనుకుంటా. ఇప్పుడు తెలిసిన పెద్ద ప్రయోజనం లేదు. చేతులు కాలిన తర్వాత బర్నాల్ మాత్రమే పూసుకోవాలి. అంతే తప్ప ఆకులు పట్టుకోకూడదు. ఇప్పటికైనా దిగ్వేష్ అనవసరమైన కోపాన్ని తగ్గించుకొని.. అవసరమైన నైపుణ్యాన్ని పెంచుకుంటే గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక రికార్డులను సృష్టించుకుంటాడు. మరిన్ని అవకాశాలను సాధించుకుంటూ.. భారత జాతీయ జట్టులో స్థానాన్ని సొంతం చేసుకుంటాడు.