Yuzvendra Chahal : యజువేంద్ర చాహల్ అతడి భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకుంటున్నాడని.. వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని.. ఇప్పటికే సామాజిక మాధ్యమ ఖాతాలలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.. చాహల్ భార్య ధన శ్రీ వర్మకు విపరీతమైన పాపులారిటీ ఉంది. దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఆమెకు పేరు ఉంది.. తెలుగులో కూడా ధన శ్రీ వర్మ హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతకాలంగా చాహల్, ధనశ్రీ వర్మ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని.. అందువల్లే విడివిడిగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.. దీనికి తగ్గట్టుగానే చాహల్ తన భార్యతో దిగిన ఫోటోలు మొత్తం సోషల్ మీడియాలో తొలగించాడు. మరోవైపు ధన శ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో తన భర్తను అన్ ఫాలో చేసింది. ఆమె పేరు నుంచి చాహల్ పేరును తొలగించింది.
ఇక అప్పటినుంచి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని.. వేరువేరుగా ఉంటున్నారని.. సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం వెనుక జరిగింది అదేనని ప్రచారం జరుగుతోంది.. ఇప్పుడు చాహల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనగా మారింది..” ప్రేమ గొప్పది. నిజమైన ప్రేమ మరింత గొప్పది. నా పేరులో ప్రేమ దర్శనమిస్తుంది. అందువల్లే నా పేరు ప్రేమకు ప్రతీకగా ఉంటుందని” చాహల్ పేర్కొన్నాడు.. దీంతో ఆ పోస్ట్ సామాజిక మాధ్యమాలలో చర్చకు కారణమవుతోంది. ఇక ఇదే సమయంలో ధన శ్రీ వర్మతో చాహల్ కుదుర్చుకున్న విడాకుల భరణం కూడా సంచలనగా మారింది. విడాకుల భరణం కింద ధనశ్రీ వర్మ 60 కోట్ల వరకు చాహల్ నుంచి తీసుకుందని తెలుస్తోంది.. ఈ నగదును చాహల్ ధన శ్రీ వర్మకు తన ఖాతా ద్వారా పంపించాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే విడాకుల వ్యవహారంపై చాహల్, ధన శ్రీ వర్మ నోరు విప్పడం లేదు. అయితే వీరి వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని.. అందువల్లే నోరు విప్పడం లేదని సమాచారం. అయితే ఈ విడాకుల వ్యవహారం ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. భరణం గురించి.. చాహల్ చెల్లించిన 60 కోట్ల గురించి మాత్రం సోషల్ మీడియాలో రోజుకో తీరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో వేచి చూడాల్సి ఉంది. అన్నట్టు ఇటీవల చాహల్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడని.. ధన శ్రీ వర్మతో విడాకులు పూర్తికాగానే ఆమెను పెళ్లి చేసుకుంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.