https://oktelugu.com/

Ben Stokes : ఏం ఆడకుండానే గెలిపించావ్ కదాయ్యా.. క్రికెట్ లోనే అరుదైన రికార్డ్

ప్రధాన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లోను బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ చేయకుండానే విజయాన్ని అందించి పెట్టిన తొలి కెప్టెన్ గా అరుదైన రికార్డు నమోదు చేశాడు బెన్ స్టోక్స్.

Written By:
  • BS
  • , Updated On : June 4, 2023 9:58 am
    Follow us on

    Ben Stokes : ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టోక్స్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ చేయకుండానే జట్టుకు గొప్ప విజయాన్ని అందించి పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ గా నిలిచాడు.

    ఇంగ్లాండ్ – ఐర్లాండ్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పది వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న బెన్ స్టోక్స్ ఈ విజయంతో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. తొలి, రెండో ఇన్నింగ్స్ లో కూడా స్టోక్స్ బ్యాటింగ్ కు దిగే అవకాశం రాలేదు. అయినప్పటికీ జట్టుకు గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది.
    తొలి కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోనున్న బెన్ స్టోక్స్..
    ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టును నడిపించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ అత్యంత అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఈ టెస్ట్ లో బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ చేయకుండా బ్యాటింగ్ చేయకుండా జట్టును గెలిపించిన తొలి కెప్టెన్ గా నిలిచాడు. ఇప్పటి వరకు చరిత్రలో ఇటువంటి గొప్ప విజయాన్ని ఎవరు సాధించకపోవడం గమనార్హం.  ఈ టెస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి మొదటి ఇన్నింగ్స్ లో పది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 524 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో పోరాటం చూపించింది. 362 పరుగులకు ఐర్లాండ్ జట్టు పరిమితమైంది. దీంతో 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుని ఘన విజయం నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో  కెప్టెన్ బెన్ స్టోక్స్ కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం లభించకపోగా, రెండో ఇన్నింగ్స్ లోనూ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు గొప్ప విజయాన్ని అందించడమే కాకుండా తన పేరిట కూడా గొప్ప రికార్డులను నమోదు చేసుకున్నాడు. ఈ ఘనతను సాధించిన తొలి కెప్టెన్ గా రికార్డులకు ఎక్కాడు.
    తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. 
    ఇంగ్లాండ్ – ఐర్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు పది వికెట్లు నష్టపోయి 172 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ జట్టులో జేమ్స్ మెక్ కల్లమ్ 108 బంతుల్లో 36 పరుగులు, పాల్ స్టెర్లింగ్ 35 బంతుల్లో 30 పరుగులు, టక్కర్ 33 బంతుల్లో 18 పరుగులు, కుర్టీస్ కాంప్హెర్ 79 బంతుల్లో 33 పరుగులు, అండి మెక్ బ్రెయిన్ 23 బంతుల్లో 19 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో స్వల్ప స్కోర్ కు ఐర్లాండ్ జట్టు పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు వన్డే తరహాలో బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టుకు భారీ స్కోర్ లభించింది. ఇంగ్లాండ్ జట్టులో జాక్ కార్వేల్ 45 బంతుల్లో 56 పరుగులు, డకెట్ 178 బంతుల్లో 182 పరుగులు, ఓలి పోప్ 208 బంతుల్లో 205 పరుగులు, జో రూట్ 59 బంతుల్లో 56 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లు నష్టానికి 524 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు 362 పరుగులకు పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్ తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్ లో కొంత మెరుగ్గానే ఐర్లాండ్ బాటర్లు రాణించడంతో భారీ స్కోరు చేయగలిగింది ఐర్లాండ్ జట్టు. హరీ టేక్టర్ 98 బంతుల్లో 51 పరుగులు, టక్కర్ 64 బంతుల్లో 44 పరుగులు, కర్టేస్ కాంప్ హెర్  34 బంతుల్లో 19 పరుగులు, అండి మెక్ బ్రెయిన్ 115 బంతుల్లో 86 పరుగులు, మార్కు అడైర్ 76 బంతుల్లో 88 పరుగులు చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో 362 పరుగులు చేసింది ఐర్లాండ్ జట్టు. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు జట్టు నాలుగు బంతుల్లోనే విజయం సాధించింది.
    బెన్ స్టోక్స్ కు అవకాశం రాకపోవడంతో..
    ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి నలుగురు బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో బెన్ స్టోక్స్ కు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. రెండో ఇన్నింగ్స్ లోను స్వల్ప స్కోర్ కావడంతో అంత వరకు అవకాశమే లేకుండా పోయింది. బౌలింగ్ లో మొదటి ఇన్నింగ్స్ లో బ్రాడ్ ఐదు వికెట్లు తీయగా జాక్ లీచ్ మూడు, మాత్యూ పాట్స్ రెండు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ జట్టును కకావికలం చేశారు. దీంతో బౌలింగ్ చేసే అవకాశం స్టోక్స్ కు దక్కలేదు. రెండో ఇన్నింగ్స్ లో జోష్ తంగ్యు ఐదు వికెట్లు పడగొట్టగా, మిగిలిన బౌలర్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ప్రధాన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో రెండో ఇన్నింగ్స్ లోను బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. దీంతో బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ చేయకుండానే విజయాన్ని అందించి పెట్టిన తొలి కెప్టెన్ గా అరుదైన రికార్డు నమోదు చేశాడు బెన్ స్టోక్స్.