https://oktelugu.com/

Ileana Dcruz : ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అతనేనా..? బయటపడ్డ షాకింగ్ నిజం

ఈ ఫొటోలో ఇలియానా చేతికి ఉంగరం ఉండడాన్ని మనం గమనించొచ్చు. అంటే వీళ్లిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని చాలా కాలం అయ్యిందనే విషయం ఈ ఫోటో ద్వారా తెలిసిందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ వ్యక్తి ఎవరు?, ఏమి చేస్తుంటాడు?, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన  వ్యక్తా?, లేదా వేరే రంగానికి సంబంధించిన వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : June 4, 2023 / 09:49 AM IST
    Follow us on

    Ileana Dcruz :  తన అందం తో కుర్రకారులను పిచ్చెక్కించి సౌత్ లో నెంబర్ హీరోయిన్ 1 గా ఎదిగి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఇలియానా, ఈమధ్య కాలం లో వెండితెర మీద కనిపించి చాలా కాలం అయ్యింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలు , మరియు తన జీవితం లో చోటు చేసుకునే సంఘటనల గురించి అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆమె.

    అలా ఆమె రీసెంట్ గా తానూ గర్భం దాల్చినట్టుగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులతో షేర్ చేసుకుంది. ఆమె వార్త చెప్పినప్పుడు ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ షాక్ కి గురయ్యారు. ఎవరికీ తెలియకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు?, లేదా పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చావా? , అసలు ఏమి జరుగుతుంది? అంటూ అభిమానులు ఆమెని రోజూ ప్రశ్నిస్తూనే ఉన్నారు.

    దీనికి ఆమె ఇన్ని రోజులు సమాధానం చెప్పలేదు. కానీ తనకి వచ్చిన బేబీ బంప్ ని చూపిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పెడుతూనే ఉంది ఈ గోవా బ్యూటీ. ఆ ఫోటోల క్రింద కామెంట్స్ లో ఎవరిని పెళ్లి చేసుకున్నావో చెప్పు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూనే ఉన్నారు,  వాళ్లందరికీ సమాధానం గా రీసెంట్ గా ఇలియానా ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని అతని ముఖం చూపించకుండా ఒక ఫోటోని అప్లోడ్ చేసింది.