Sai Dharam Tej : ఈ సమ్మర్ లో ‘విరూపాక్ష’ అనే హారర్ థ్రిల్లర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను కొల్లగొట్టి ది బెస్ట్ కం బ్యాక్ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ఒక్క పాట మరియు ఫైట్ తప్ప మొత్తం పూర్తి అయ్యింది.ఇక సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు బ్యాలన్స్ ఉన్నాయి. వాటి చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయం లో సాయి ధరమ్ తేజ్ మ్యానేజర్ సతీష్ మరియు సాయి ధరమ్ తేజ్ కి పెద్ద గొడవ జరిగిందట.
తనపై గౌరవం లేకుండా ప్రవర్తించినందుకు మ్యానేజర్ సతీష్ పై సాయి ధరమ్ తేజ్ అరిచాడని, అలా వాళ్ళిద్దరి మధ్య మాటామాటా పెరగడం తో సాయి ధరమ్ తేజ్ సతీష్ చెంప పగలగొట్టి షూటింగ్ స్పాట్ నుండి గెంటేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ‘బ్రో ది అవతార్’ కి సంబంధించిన ప్రొమోషన్స్ అన్నీ సతీష్ దగ్గరుండి చూసుకునేవాడు.
ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం తో ఈ వారం విడుదల అవ్వాల్సిన ‘బ్రో ది అవతార్’ టీజర్ వాయిదా పడింది అట. ఇప్పుడు గీత ఆర్ట్స్ కి సంబంధించిన ఒక వ్యక్తిని తన మ్యానేజర్ గా సాయి ధరమ్ తేజ్ నియమించుకున్నట్టు సమాచారం. ఎప్పుడూ కూల్ గా ఎంతో స్నేహపూర్వకంగా ఉండే సాయి ధరమ్ తేజ్, ఇలా గొడవపడ్డాడు అంటే కచ్చితంగా తప్పు మ్యానేజర్ సతీష్ దగ్గరే ఉందని అంటున్నారు ఫ్యాన్స్.