Jio – Airtel : దేశ టెలికాం రంగంలో పెను విప్లవం తీసుకువచ్చింది ‘జియో’ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రిలయన్స్ కు కంపెనీ ముఖేష్ అంబానీకి చెందిన జియో రావడంతో అప్పటి వరకు మార్కెట్లో ఉన్న రిలయన్స్, వొడాఫోన్, ఐడియా, యూనినార్, బీఎస్ఎన్ఎల్ లాంటి బడా బడా టెలికాం సంస్థలు కుప్పకూలిపోయాయి. అందులో రిలయన్స్ కమ్యునికేషన్ పూర్తిగా దుకాణం సర్దుకోగా.. వొడాఫోన్, ఐడియా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ గా మారాయి. కానీ అది కూడా చివరికి కనిపించకుండా పోయింది.
అయితే, ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. బడా టెలికాం ఆపరేటర్లు అయిన జియో, భారతీ ఎయిర్ టెల్ ను తట్టుకుంటూ నెట్టుకస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం (2024) ఆగస్ట్ లో 4జీ సేవలను దేశ వ్యాప్తంగా ప్రారంభిస్తుంది.
ఇటీవల రిలయన్స్ జియో రీచార్జి టారీఫ్ రేట్లను పెంచింది. జియో పెంచిన ఒక్క రోజు తేడాతో ఎయిర్ లెట్ కూడా పెంచింది. దీంతో యూజర్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే మధ్య తరగతి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. జియో సిగ్నల్, ఇతర నెట్ వర్క్ లకు సంబంధించి వై ఫైలకు కనెక్ట్ అయితే చేసే డిస్టపెన్స్ తో విసిగిపోతున్నారు. ఎయిర్ టెల్ కూడా టారీఫ్ లను విపరీతంగా పెంచడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ మారాలని కూడా అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
జియో ధరలు పెంచడంతో మొదలు ఏయిర్ టెల్ కు మారుదామని అనుకున్నారు. కానీ ఒక్క రోజు తేడాతో ఎయిర్ టెల్ కూడా ధరలు పెంచడంతో బీఎస్ఎన్ఎల్ బెస్ట్ అని అనుకుంటున్నారు. పైగా ఈ సంవత్సరం నుంచి 4జీ సేవలు కూడా ప్రారంభిస్తుండడంతో ఈ నెట్ వర్కే బెటర్ అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్ పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.