ఐపీఎల్ లో ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయే ధోనీ.. ఆదాయం పొందడంలోనూ నెంబర్ వన్ గా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ఆదాయం పొందిన క్రికెటర్ గా.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ నిలిచాడు. ఈ లీగ్ లో రెండు జట్లకు (సీఎస్కే – రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ) ఆడటం ద్వారా ఇప్పటి వరకు ధోనీ రూ. 37 కోట్లు ఆర్జించాడు. ఈ మొత్తం ఆ జట్లకు ఆడేందుకు చేసుకున్న ఒప్పందం ద్వారా వచ్చింది మాత్రమే. ఇందులో “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” వంటి అవార్డుల ద్వారా వచ్చిన ఆదాయం కలవలేదు. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో సీఎస్కే జట్టు ధోనీని రూ.6 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. వరుసగా మూడేళ్లపాటు రూ.6 కోట్లు దక్కించుకున్న మహీ.. 2011 నుంచి 2013 వరకు రూ. 8.2 కోట్లు తీసుకున్నాడు. 2014 నుంచి 2017 వరకు రూ. 12.5 కోట్ల చొప్పున అందుకున్నాడు. 2018 నుంచి 2020 వరకు రూ.15 కోట్ల చొప్పున తీసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఇప్పటి వరకు రూ.131 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లోనే ఖరీదైన ఆటగాడిగా ఉన్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ రూ.126 కోట్లు అందుకొని మూడో స్థానంలో నిలిచాడు.
Also Read: వన్డే సిరీస్ పాయే..టీంఇండియా టీంలో అనూహ్య మార్పులు?